‘30 రోజుల్లో...?’కలెక్షన్స్ : లాభాలా ..నష్టమా..ఎంత?

ప్రముఖ వ్యాఖ్యాత ప్రదీప్ మాచిరాజు హీరోగా వెండితెరకు పరిచయం అయిన తొలి చిత్రం ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’. మున్నా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మొన్న శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమాకు ఊహించని విధంగా డివైడ్ టాక్ వచ్చింది. రివ్యూలు నెగిటివ్ గా వచ్చాయి. ఈ నేపధ్యంలో ఈ సినిమా కలెక్షన్స్ పరిస్దితి ఏమిటనేది హాట్ టాపిక్ గా మారింది.  

30 Rojullo Preminchadam Ela s box office recovery is good jsp

 తొలిరోజే రూ.4 కోట్ల గ్రాస్‌ సాధించిందని.... ఇక తన తొలి సినిమాకు మంచి ఆదరణ లభించడంతో ప్రదీప్‌ సంతోషం వ్యక్తం చేశాడు. అభిమానులకు, ప్రేక్షకులకు ధన్యవాదాలు చెబుతూ ఓ ఎమోషనల్‌ లేఖ రాసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. దాంతో అసలు ఎంత వచ్చింది. నిర్మాతలు సేఫ్ అయ్యారా వంటి విషయాలు చూద్దాం. 

ఈ సినిమా పది కోట్లు దాకా గ్రాస్ వచ్చిందని ట్రేడ్ లో చెప్తున్నారు. ఈ చిత్రానికి రూ. 4.5 కోట్ల వరకూ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఇంకా ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే మరో 5 కోట్ల వరకూ షేర్ ను రాబడితే చాలు. మూడు రోజులు పూర్తయ్యే సరికి ఈ చిత్రం 4.51కోట్ల కలెక్షన్లను రాబట్టిందని టాక్. మరో 0.50 కోట్ల షేర్ ను రాబడితే ఈ చిత్రం క్లీన్ హిట్ గా నిలిచినట్టే అని చెప్పాలి. 

సినిమాని చాలా జాగ్రత్తగా ప్రమోట్ చేయటం కలిసొచ్చింది. దాంతో మినిమం గ్యారెంటీ సినిమాగా బయిటపడింది. లో బడ్జెట్ లో తీసిన సినిమా కావటంతో ఇప్పటిదాకా సినిమాకు పెట్టిన పెట్టుబడిలో సగం రికవరీ అయ్యిందని, ఫైనల్ గా ఎబోవ్ యావరేజ్ గ్రాసర్ గా భాక్సాఫీస్ వద్ద రిజల్ట్ నమోదు అవుతుందని లెక్కలేస్తున్నారు. 

 ఈ సినిమాకు సోలో రిలీజ్ దొరికటం కలిసొచ్చే విషయం. ఫిబ్రవరి 5న జాంబీ రెడ్డి వచ్చేవరకూ ఈ సినిమాకు పెద్దగా పోటీ లేదు. క్రాక్, మాస్టర్ వంటి సినిమాలు కూడా ఓటిటిలో వచ్చేస్తుండడంతో ప్రదీప్ సినిమాకు మంచి అవకాశం దొరికుతోంది. ప్రదీప్ కు ఉన్న క్రేజ్, హిట్టైన పాట ఎఫెక్ట్ తో  సినిమా నడిచిపోతోంది.  నిజానికి ఈ సినిమా షూటింగ్ గతేడాది పూర్తయింది. మార్చ్ లోనే ఫస్ట్ కాపీ సిద్ధమైంది. అయితే కరోనా కారణంగా సినిమా విడుదలను ఆపివేశారు. ఇప్పుడు థియేటర్లు తెరుచుకోవడంతో సినిమాను విడుదల చేసారు. ఇది ఒక పీరియాడిక్ ప్రేమకథగా  గత జన్మల నేపథ్యంలో నడిచింది. 

 ‘ఆర్య 2’, , నేనొక్కడినే’ చిత్రాలకు సుకుమార్‌ దగ్గర అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేసిన మున్నా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అమృతా అయ్యర్‌ హీరోయిన్‌గా నటించింది. ఇందులోని నీలి నీలి ఆకాశం.. సాంగ్‌ ఎంతోమంది ప్రేక్షకుల మనస్సుల్లో ఇప్పటికీ మారుమోగుతూనే ఉంది. అనూప్‌ సంగీతం, చంద్రబోస్‌ సాహిత్యం, సిద్‌ శ్రీరామ్, సునీత సుమధర గానం.. అన్నీ కలిసి ఈ పాటను ఇంత బ్లాక్‌బస్టర్‌ చేశాయి.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios