భారీ అంచనాలతో గత నెల 29న ప్రేక్షకుల ముందుకు వచ్చిన 2.0 ఎక్కువగా పాజిటివ్ టాక్ ను అందుకున్నప్పటికీ పలుచోట్ల 2డి లో నెగిటివ్ టాక్ ను అందుకుంది. అయితే చాలా వరకు పలు ఏరియాల్లో బయ్యర్స్ కొన్న ధరను ఇంకా షేర్స్ రూపంలో పూర్తిగా రాబట్టుకోలేదు. వారందరు భయం భయంతో ఉన్నట్లు తెలుస్తోంది. 

దాదాపు 450కోట్లకు పైగా ఖర్చు చేసిన నిర్మించిన 2.0 500 కోట్లనైతే దాటేసింది గాని అన్ని ఏరియాల్లో ఆ ప్రభావం కనిపించలేదు. బాలీవుడ్ లో ఇప్పుడైతే లాభాలతో దూసుకుపోతోంది. కానీ తెలుగు - తమిళ్ లోనే తేడా కొడుతోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో సినిమా ఇంకా బ్రేక్ ఈవెన్ కి చేరుకోలేదు. 70+ కోట్లకు అమ్ముడుపోయిన ఈ విజువల్ వండర్ రీసెంట్ గా 50 కోట్ల షేర్స్ ను అందించింది. 

అయితే మిగతా ఎమౌంట్ ఎంతవరకు వస్తుందో చెప్పడం కష్టమే. ఎందుకంటే ఈ వారం మూడు సినిమాలు రిలీజ్ కానున్నాయి. అంతరిక్షం - పడి పడి లేచే మనసు అదే విధంగా భారీ అంచనాలతో KGF రిలీజ్ కానుంది. వీటిలో రెండు సినిమాలు క్లిక్ అయినా సౌత్ లో 2.0 కలెక్షన్స్ కి బ్రేక్ పడినట్లే. దీంతో బయ్యర్స్ భయంభయంతో ఉన్నట్లు సమాచారం.