శంకర్ సృష్టించిన విజువల్ వండర్ 2.0 మొత్తానికి సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. ఓ వర్గం నుంచి భిన్నాభిప్రాయాలు వచ్చినప్పటికీ అంచనాల ప్రకారం 2.0 మంచి కలెక్షన్స్ దూసుకుపోతోంది. ముఖ్యంగా వీకెండ్స్ లో డబుల్ ప్రాఫిట్స్ ను అందిస్తుండడం గమనార్హం. 

ఇక తమిళనాడులో అతి ముఖ్యమైన చెన్నై సిటీలో బాహుబలి రికార్డ్ ను బ్రేక్ చేయడానికి 2.0 సిద్ధమైంది. బాహుబలి తమిళ్ వెర్షన్ లైఫ్ టైమ్ కలెక్షన్స్ 18.82 కోట్లను వసూలు చేయగా నేటితో ఆ రికార్డ్ ను రజిని సినిమా తుడిచిపెట్టనుంది. ఆదివారం నాటికి 2.ఓ 18.42 కోట్లను వసూలు చేసింది. ఆ సిటీలో మరికొంత వసూలు చేయడం పెద్ద కష్టమేమి కాదు. 

నేడు అర కోటివరకు కలెక్షన్స్ అందినా కూడా మొదటగా బాహుబలి రికార్డ్ ను ఒక ఏరియాలో డామినేట్ చేసినట్టే. ఈ వీక్ లో కూడా పెద్ద సినిమాల పోటీ లేకపోవడంతో మంచి వసూళ్లే అందే అవకాశం ఉంది. ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా ఇప్పటికే 600కోట్ల గ్రాస్ ను ఈ సినిమా అందుకుంది.