ఇండియన్ సిల్వర్ స్క్రీన్ ను షేక్ చేయడానికి 2.0 సిద్ధమైంది. శంకర్ సృష్టించిన ఈ విజువల్ వండర్ ఈ నెల 29న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. గత కొంత కాలంగా కొన్ని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న చిత్ర యూనిట్ ఫైనల్ గా అన్ని పనులను ఫినిష్ చేసుకుంది. దానితో పాటే సెన్సార్ పనులను కూడా ముగించుకుంది. 

సెన్సార్ బోర్డు సినిమాకు U/A సర్టిఫికెట్ ను జారీచేసింది. మంచి సైన్స్ ఫిక్షన్ అండ్  యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా 3డిలో అదిరిపోయిందని టాక్ వస్తోంది. శంకర్ కొన్ని సన్నివేశాలను స్పెషల్ గా 3డి ఫార్మాట్ లో చూపించిన తీరుకు సెన్సార్ సభ్యుల నుంచి ప్రశంసలు అందాయి. సినిమా తప్పకుండా అందరికి నచ్చుతుందని రికార్డులు బద్దలు కొట్టడం ఖాయమంటున్నారు. 

మరి సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి. లైకా ప్రొడక్షన్స్ దాదాపు 500కొట్లకు పైగా ఖర్చు పెట్టి సినిమాను నిర్మించింది. రజినీకాంత్ - అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్న ఈ సినిమాకు ఏఆర్.రెహమాన్ సంగీతం అందించారు.