భారతదేశ సినీ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా అందరిని ఆశ్చర్యపరచడానికి రాబోతోన్న చిత్రం 2 పాయింట్ 0. సంచలన దర్శకుడు శంకర్ తెరకెక్కించిన ఈ సినిమా గ్రాఫిక్స్ వర్క్స్ ఎట్టకేలకు ఎండింగ్ కు వచ్చేశాయి. మరికొన్ని రోజుల్లో ఫైనల్ అవుట్ ఫుట్ ని కూడా చెక్ చేయనున్నారు. 

కొన్ని రోజుల క్రితం రిలీజ్ చేసిన 2.0 టీజర్ బాగానే ఆకట్టుకుంది గాని ఓ వర్గం వారి అంచనాలను టీజర్ అందుకోలేదననే టాక్ కూడా వచ్చింది. అయితే ఇప్పుడు అలాంటి విమర్శలకు తావివ్వకుండా అందరిని థియేటర్స్ వరకు తీసుకువచ్చేలా శంకర్ ట్రైలర్ ను వదలనున్నాడు. నవంబర్ 3న ట్రైలర్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. 

ట్రైలర్ లో శంకర్ మార్క్ సీన్స్ తో పాటు హాలీవుడ్ రేంజ్ లో విజువల్ ఎఫెక్ట్స్ సన్నివేశాలు ఉంటాయని తెలుస్తోంది. దాదాపు 450కోట్లతో నిర్మించిన ఈ సినిమా దీపావళి కానుకగా నవంబర్ 29న రిలీజ్ కానుంది. రజినీకాంత్ హీరోగా నటించిన ఈ సినిమాలో అక్షయ్ కుమార్ ఒక డిఫరెంట్ రోల్ లో కనిపించనున్న సంగతి తెలిసిందే.