ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఎప్పుడు చూడని విజువల్ ఎఫెక్ట్స్ ని చూపిస్తానని దర్శకుడు శంకర్ గత ఏడాది నుంచి ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచుతున్నాడు. సినిమా ఎప్పుడు విడుదలవుతుందా అని అటు సినిమా పరిశ్రమలో కూడా చాలా మంది ప్రముఖులు ఎదురుచూస్తున్నారు. ఇక నవంబర్ 29న రానున్న ఈ సినిమా ట్రైలర్ ను మరికొన్ని రోజుల్లో విడుదల చేయనున్నారు. 

డేట్ ను కూడా ఫిక్స్ చేసుకున్నారు. నవంబర్ 3న అందరిని ఆకట్టుకునే విధంగా సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నట్లు చెప్పారు. ఇప్పటికే టీజర్ తో సరికొత్త రికార్డులు బ్రేక్ చేసిన 2.0 టీమ్ ఇప్పుడు ట్రైలర్ తో అంతకంటే ఎక్కువ అంచనాలను రేపేలని చూస్తోంది. ఈ సినిమాను కోసం దాదాపు 450కోట్ల రూపాయలను ఖర్చు చేశారు. 

గత ఏడాది దీపావళికి ప్రేక్షకుల ముందుకు రావాల్సిన 2.0 వాయిదాలు పడుతూ ఈ దీపావళి తరువాత రాబోతోంది. అక్షయ్ కుమార్ - రజినీకాంత్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమాలో అమీ జాక్సన్ హీరోయిన్ గా నటించింది.