Asianet News TeluguAsianet News Telugu

‘ఆది పురుష్’ గ్రాఫిక్స్‌ పై అంత ఖ‌ర్చా? మొత్తం బడ్జెట్ ఎంత

ప్రభాస్‌ డైరక్ట్ గా బాలీవుడ్‌లోకి ఎంట్రీ నటిస్తున్న చిత్రం 'ఆది పురుష్‌'. ఆయన నటిస్తున్న 22వ చిత్రమిది. ఈ చిత్రం టైటిల్‌ పోస్టర్‌ని చూస్తుంటే ఇదొక మైథలాజికల్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఉండే చిత్రంగా అర్థమవుతుంది. 

250 Crore to Be Spent on  prabhas adipurush Graphics
Author
Hyderabad, First Published Aug 23, 2020, 12:43 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

ఇప్పుడు పెద్ద సినిమాలు అన్నీ గ్రాఫిక్స్ మీద ఆధారపడి నిర్మాణమవుతున్నాయి. భారీతనం అంతా గ్రాఫిక్స్ బడ్జెట్ లోనే ఉంటోంది. తాజాగా ప్రభాస్‌ డైరక్ట్ గా బాలీవుడ్‌లోకి ఎంట్రీ నటిస్తున్న చిత్రం 'ఆది పురుష్‌'. ఆయన నటిస్తున్న 22వ చిత్రమిది. ఈ చిత్రం టైటిల్‌ పోస్టర్‌ని చూస్తుంటే ఇదొక మైథలాజికల్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఉండే చిత్రంగా అర్థమవుతుంది. ఓ పక్క ఆంజనేయుడు, మరో పక్క బాణం సంధిస్తున్న రాముడు, పది తలల రావణాసురుడు ఉండటంతో రామాయణం ఇతివృత్తంగా, చెడుపై మంచి సాధించే విజయానికి ప్రతీకగా ఈ సినిమా ఉంటుందని తెలియజేస్తోంది. అదే సమయంలో ఈ సినిమా గ్రాఫిక్స్ బడ్జెట్ కూడా ఓ రేంజిలో ఉండబోతోందని అంచనా వేస్తున్నారు. 

మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాకు 250 కోట్ల భారీ బడ్జెట్ ని గ్రాఫిక్స్ కోసం పెట్టనున్నారట. అంతా గ్రీన్ మ్యాట్ లోనే షూటింగ్ చేస్తారట. ఈ సినిమాలో ఎక్కువ శాతం విజువల్ ఎఫెక్ట్ తో నిండి ఉంటాయి. అవతార్ స్దాయిలో గ్రాఫిక్స్ ఉంటాయని, లొకేషన్స్ అన్ని విజువల్ గ్రాఫిక్స్ అని తెలుస్తోంది. దాంతో ఈ సినిమా బడ్జెట్ 500 కోట్లు వరకూ అవుతుందని, త్రీడిలో తీస్తున్న సినిమా,అదీ ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నది కావటంతో గిట్టుబాటు అవుతుందని చెప్తున్నారు. ఈ చిత్రం దర్శకుడు విజువల్ ఎఫెక్ట్స్ లో ఎక్సపర్ట్ అని తెలుస్తోంది. 
 

 అలాగే “ఆది పురుష్” సినిమాలో ప్రభాస్ పాత్ర ఏంటి? అంటే..రాముడిగా ప్రభాస్ నటించబోతున్నాడని, ఆ దేవుడి పాత్రలో అతికొద్దిమంది నటులు మాత్రమే రాణించారన్నట్లుగా దర్శకుడు నాగ్ అశ్విన్ తేల్చాసాడు.

Follow Us:
Download App:
  • android
  • ios