'కుమారి 21 ఎఫ్' సినిమాలో తన బోల్డ్ పెర్ఫార్మన్స్ తో యూత్ ని ఆకట్టుకున్న హీరోయిన్ హెబ్బా పటేల్ తాజాగా '24 కిస్సెస్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ముద్దుల ఉత్సవంతో నేడు థియేటర్ లోకి వచ్చిన ఈ సినిమాలో అరుణ్ అదిత్ హీరోగా నటించాడు.

సినిమా టీజర్, ట్రైలర్ లకి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. 'మిణుగురులు' లాంటి అవార్డు విన్నింగ్ సినిమాను రూపొందించిన అయోధ్య కుమార్ కృష్ణం శెట్టి ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ట్రైలర్ లో హీరో, హీరోయిన్లు మధ్య రొమాంటిక్ సన్నివేశాలు, ఘాటైన ముద్దు సీన్లతో యూత్ లో ఈ సినిమాపై ఆసక్తిని పెంచేశారు.

సినిమా ప్రమోషన్స్ లో కూడా శృంగార రసం మితిమీరి ఉండడంతో ఈ సినిమాపై చిత్రసీమలో పెద్ద చర్చే నడించింది. ఇలాంటి బూతు సినిమాలను ఎంకరేజ్ చేయొద్దంటూ టీవీలో చర్చా వేదికలు కూడా నడిచాయి.

అయితే ఇది బూతు సినిమా కాదని మంచి క్లాసికల్ లవ్ స్టోరీ అంటూ సినిమా చూసిన కొందరు చెబుతున్నారు. ఎవరూ మర్చిపోలేని మంచి లవ్ స్టోరీ అని టాక్. థియేటర్ నుండి బయటకి రాగానే ఎమోషన్ అనే తీపి గుర్తుతో వస్తారని దర్శకుడు అన్నారు.