Asianet News TeluguAsianet News Telugu

నా కూతురు బన్నీకి బిగ్ ఫ్యాన్.. ఎన్టీఆర్, చరణ్ లతో సినిమా చేయాలని ఉంది.. ‘2018’ హీరో టోవినో థామస్

`2018` మూవీ సక్సెస్ మీట్ లో హీరో టొవినో థామస్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్టీఆర్, చరణ్, అల్లు అర్జున్ గురించి మాట్లాడటం ఇంట్రెస్టింగ్ గా మారింది. 
 

2018 movie Hero Tovino Thomas Interesting comments about NTR, Ram Charan and Allu Arjun at success meet NSK
Author
First Published May 27, 2023, 8:37 PM IST

కేరళలో రీసెంట్ టైమ్స్ లో ఇండస్ట్రీ హిట్‌గా నిలబడిన చిత్రం  2018. ఈ చిత్రం నిన్న (May 25)  తెలుగులో విడుదలైంది.   ప్రముఖ నిర్మాత బన్నీ వాస్ ఈ మాస్టర్‌పీస్‌ని తెలుగు ప్రేక్షకులకు అందించారు. ప్రస్తుతం ఈ సినిమాకి  అనూహ్య స్పందన లభిస్తుంది. ప్రతి ఒక్కరూ ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. కలక్షన్స్ వర్షం కూడా కురిపిస్తుంది. మాలీవుడ్ లో రూ.150 కోట్ల వరకు వసూల్ చేసిన ఈ చిత్రం.. ఇక్కడ మొదటి రోజు రూ.1 కోటీ వరకు కలెక్ట్ చేసింది. చిత్రంలో టోవినో థామస్ (Tonivo Thomas)  ప్రధాన పాత్రలో నటించారు. ఇంద్రన్స్, కుంచాకో బోబన్, అపర్ణ బాలమురళి (Aparna Balamurali) , వినీత్ శ్రీనివాసన్, ఆసిఫ్ అలీ, లాల్, నరేన్, తన్వి రామ్, శ్శివద, కలైయరసన్, అజు వర్గీస్, సిద్ధిక్ ముఖ్య పాత్రలు పోషించారు. 

అయితే, చిత్రానికి మంచి రెస్పాన్స్ రావడంతో తాజాగా 2018 చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా హీరో టోవినో థామస్ మాట్లాడుతూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.... ఆయన మాట్లాడుతూ.. ‘13 సంవత్సరాల క్రితం కాలేజ్ ట్రిప్ కోసం హైదరాబాద్ వచ్చాను, కోయంబత్తూరు లో చదువుకునేటప్పుడు. నావి కొన్ని డబ్ సినిమాలు ఆహా వీడియోలో ఉన్నాయి. మొదటి సారి ఈ సినిమా ప్రమోషన్ కోసం హైదరాబాద్ వచ్చాను. ఈ సినిమాను ఊహించని స్థాయిలో రిసీవ్ చేసుకున్నందుకు ప్రేక్షకులకు చాలా థాంక్యూ. మా హార్డ్ వర్క్ ను అప్రీసెట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. బన్నీ వాసు ఈ సినిమా రిజల్ట్ ను మార్నింగ్ చూపిస్తున్నప్పుడు చాలా ఆనందంగా అనిపించింది. మీరు చూపిస్తున్న ప్రేమతో ఖచ్చితంగా నా తర్వాత సినిమాలు కూడా తెలుగులో డబ్ అయ్యేటట్లు చూస్తాను.‘ అంటూ చెప్పుకొచ్చారు.

అలాగే తెలుగు స్టార్ హీరోలు ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ పైనా ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. టోవినో థామస్ కూతురు అల్లు అర్జున్ కు బిగ్ ఫ్యాన్ అని చెప్పారు. మాలీవుడ్ లోనే కాకుండా ఇతర భాషా హీరోల చిత్రాల్లోనూ అవకాశం వస్తే తప్పకుండా నటిస్తాను. నాకు NTR, Ram Charan అంటే చాలా ఇష్టం. వారితో సినిమా చేసే ఛాన్స్ వస్తే వదులుకోను.’ అని వ్యాఖ్యానించడం ఆసక్తికరంగా మారింది.

అలాగే నిర్మాత ఎస్.కె.ఎన్ మాట్లాడుతూ... మలయాళం సినిమాలలో కంటెంట్ స్ట్రాంగ్ ఉంటుందని చెబుతారు. 2018 వరదలు వచ్చినప్పుడు నేను, దర్శకుడు మారుతీ గారు కేరళలోనే ఉన్నాం. శైలజ రెడ్డి అల్లుడు  రీ రికార్డింగ్ కోసం అక్కడే ఉన్నాం. అప్పటి పరిస్థితులను ఈ సినిమాలో అద్భుతంగా తెరకెక్కించారని చెప్పారు. నిర్మాత బన్నీ వాసు మాట్లాడుతూ...నేను 16, 17 సినిమాల వరకు తెలుగులో ప్రొడ్యూస్ చేసాను. కానీ ఈ సినిమా నాకు ఒక ఎక్స్ట్రా లేబుల్ ఇచ్చింది. మంచి రివ్యూ లు వచ్చాయి. 2018 లో మా గీత గోవిందం అక్కడ తెలుగులో రిలీజ్ చేసి వచ్చిన ఫండ్స్ ను కేరళకు ఆ టైం లో ఫండ్ గా ఇచ్చామని తెలిపారు. దర్శకుడు జ్యూడ్ ఆంటోని మాట్లాడుతూ... అందరికి చాలా థాంక్యూ. మీరు ప్రసాద్ లాబ్స్ లో ఈ సినిమా చూసి చివర్లో చప్పట్లు కొడుతుంటే చాలా హ్యాపీ అనిపించింది. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కి చాలా థాంక్యూ మా సినిమాను ఆదరించినందుకు. మా ప్రొడ్యూసర్స్ కి చాలా థాంక్యూ అన్నారు. హీరోయిన్ అపర్ణ బాలమురళి మాట్లాడుతూ... వేరే ఇండస్ట్రీ నుంచి వచ్చినప్పుడు ఇంత సపోర్ట్ ఇవ్వడం మాములు విషయం కాదు. 2018 సినిమాలో ఒక పార్ట్ అవ్వడం నాకు చాలా హ్యాపీ గా ఉంది. ఈ సినిమా రియల్ హీరోస్ కి ఒక ట్రిబ్యూట్. చాలా డబ్బింగ్ సినిమాల ప్రమోషన్స్ కి ఇక్కడికి వచ్చాను.ఈసారి డైరెక్ట్ తెలుగు సినిమా ప్రొమోషన్స్ కి వస్తాని అన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios