2018 ఫోర్బ్స్  లిస్ట్ లో మొత్తంగా బాలీవుడ్ ప్రముఖులే టాప్ లో నిలిచారు. అత్యధిక సంపదను కలిగిన వారిలో విజయ్ దేవరకొండ కూడా తనకంటూ ఒక స్థానాన్ని అందుకోవడం విశేషం. సల్మాన్ ఖాన్ 253 కోట్లతో మొదటి స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. 

అయితే విజయ్ దేవరకొండ 14 కోట్ల సంపాదన తో 72వ స్థానంలో నిలిచాడు. ఈ ఏడాది మహానటి - గీత గోవిందం  అలాగే టాక్సీ వాలా తో హిట్స్ అందుకున్న విజయ్ తన మార్కెట్ ను పెంచుకుంటూ వచ్చాడు. అతి తక్కువ కాలంలో స్పీడ్ గా రెమ్యునరేషన్ పెంచుకున్న హీరోగా విజయ్ నిలిచాడు. నోటా సినిమా తప్పితే మొత్తంగా 2018 విజయ్ కు మంచి లాభాలనే అందించింది. 

ప్రస్తుతం ఈ హీరోతో వర్క్ చేయడానికి టాప్ నిర్మాతలు క్యూలో ఉన్నారు. ఇక నెక్స్ట్ ఈ హీరో డియర్ కామ్రేడ్ సినిమాతో పాటు మరో రెండు సినిమాలను సెట్స్ పైకి తెచ్చే ప్రయత్నాల్లో ఉన్నాడు.