200 మంది సింగర్స్, డాన్సర్స్, 50 లక్షల బాణసంచా...ఇంకా ఎన్నో
ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను జూన్ 6న తిరుపతిలో భారీ ఎత్తులో జరుపనున్నారు. ఇక ఇప్పటికే ఈవెంట్ కు సంబంధించిన పనులు ప్రారంభమైనట్లు తెలుస్తుంది.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ముఖ్యంగా త్వరలో రిలీజ్ అవ్వబోతున్న “ఆదిపురుష్“ పైనే అందరి దృష్టీ ఉంది. ఇండియాస్ మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీస్ గా తెరకెక్కుతున్న సినిమాల్లో ఇది కూడా ఒకటి.బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా చేస్తున్నారు. కాగా కృతి సనన్ సీతగా.. ప్రముఖ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ రావణుడి పాత్రలో నటిస్తున్నారు. సుమారు 500 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ మూవీని టీ-సిరీస్, రెట్రో ఫైల్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమా జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా రిలీజ్ కానుంది. సినిమా రిలీజ్ దగ్గర పడుతుండడంతో.. మూవీ ప్రమోషన్స్ లో మరింత స్పీడ్ పెంచారు.
ఈ మేరకు జూన్ 6న ఈ మూవీ ప్రీ రిలీజ్ (Adipurush Pre Release Event) ఈవెంట్ ని తిరుపతిలో నిర్వహించబోతున్న సంగతి తెలిసిందే. అందుకు గాను ట్విట్టర్ వేదికగా ఒక పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా ఎవరు రాబోతున్నారు అన్న విషయం పై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఈ నేపధ్యంలో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కుసంభందించిన విశేషాలు హాట్ టాపిక్ గా మారాయి.
ఈ ఈవెంట్ నిమిత్తం ముంబాయి నుంచి 200 మంది డ్యాన్సర్లు వస్తున్నారు. అలాగే 200 మంది సింగర్లు రాబోతున్నారు. ఈవెంట్ లో భారీగా బాణాసంచా కాల్చబోతున్నారు.
జై శ్రీరామ్ అనే శబ్దం వచ్చే బాణా సంచా కోసం ప్రయత్నాలు జరుగుతున్నారు. . కేవలం వాటి కోసమే దాదాపు యాభై లక్షలకు పైగా ఖర్చు చేయనున్నారని తెలుస్తుంది. ఇంకా మరిన్ని విశేషాలు ఇక్కడ మనం చూడబోతున్నాము. ఏదైమైనా తిరుపతి లో ప్రీ రిలీజ్ ఫంక్షన్ ని పది కాలాలపాటు జనం చెప్పుకునేలా ఉండాలని ప్లానింగ్ జరుగుతోంది.
ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ సినిమాపై ఉన్న అంచనాలన్నింటినీ మార్చేయటమే ఈ ఉత్సాహానికి కారణం. ట్రైలర్ లో.. అహంకారపు రొమ్ము చీల్చడానికి దూకండి ముందుకి, నా ప్రాణం సీతలోనే ఉంది.. నాకు ప్రాణాల కన్నా మర్యాదే అధిక ప్రిమయమైనది అని ప్రభాస్ చెప్పిన డైలాగ్లు గూస్ బంప్స్ తెప్పించాయి. ముఖ్యంగా ట్రైలర్లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదరగొట్టింది. జై శ్రీరామ్.. జై శ్రీరామ్ అనే చాంటింగ్ వస్తుంటే.. రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి అనే చెప్పాలి.
అలాగే గతంలో ప్రభాస్ నటించిన బాహుబలి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని కూడా తిరుపతి లోనే నిర్వహించారు. దాంతో ఇప్పుడు ఈ ఈవెంట్ ని అదే ప్లేస్ లో ఏర్పాటు చేస్తుండడంతో బాహుబలి సెంటిమెంట్ వర్క్ అవుట్ అవుతుందేమో అని అభిమానులు ఫీల్ అవుతున్నారు. బాహుబలి లాగా ఆదిపురుష్ కూడా నెక్స్ట్ లెవెల్ హిట్ అందుకోవాలని రెబల్ స్టార్ ఫ్యాన్స్ అంతా బలంగా కోరుకుంటున్నారు.