ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్‌ - గ్రేట్‌ డైరెక్టర్‌ శంకర్‌ కాంబినేషన్‌ లో తెరకెక్కిన 2.0 గతవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే సినిమా వరల్డ్ వైడ్ గా నాలుగువందల కోట్లను క్రాస్ చేసింది అంటూ పోస్టర్స్ తెగ హల్ చల్ చేస్తున్నాయి. 

ఇక కొన్ని దేశాల్లో ఇంకా విడుదల కానీ ఈ విజువల్ వండర్ ను భారీగా రిలీజ్ చేయడానికి చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ సన్నాహకాలు చేస్తోంది. ముఖ్యంగా ఇటీవల భారతీయ సినిమాలకు బ్రహ్మరథం పడుతున్న చైనా ప్రేక్షకులకు సినిమాను అందించాలని శంకర్ టీమ్ డిసైడ్ అయ్యింది. 

అక్కడ హెచ్‌వై మీడియాతో అసోసియేట్‌ అయిన లైకా  '2.0' చిత్రాన్ని చైనా భాషలో డబ్‌ చేసి రిలీజ్‌ చేయనుంది.  సెంచరీ ఫాక్స్‌, వార్నర్‌ బ్రదర్స్‌, యూనివర్సల్‌, డిస్నీ సంస్థలతో అసోసియేట్‌ అయిన హెచ్‌వై మీడియా ఎన్నో హాలీవుడ్ సినిమాలను చైనాలో రిలీజ్ చేసింది. 

ఇక ఇప్పుడు చైనాలో రజిని సినిమాను 10,000 థియేటర్స్‌ లో రిలీజ్ చేయనున్నారు. అంటే దాదాపు 56,000 స్క్రీన్స్‌ లలో సినిమాను ప్రదర్శించనున్నారు. 2019 మేలో 2.0 అక్కడ గ్రాండ్ గా రిలీజ్ కానున్నట్లు సమాచారం.