2.0 టీజర్ టైమ్ ఎప్పుడంటే..?

https://static.asianetnews.com/images/authors/74ce1d03-f84b-5b8e-abc1-c43c5f7c8632.jpg
First Published 7, Sep 2018, 6:30 PM IST
2.0 movie teaser release date
Highlights

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో వస్తోన్న క్రేజీ చిత్రం '2.0'. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా..? అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో వస్తోన్న క్రేజీ చిత్రం '2.0'. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా..? అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్ ను వదిలిన చిత్రబృందం ఇప్పుడు టీజర్ ని విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. టీజర్ ప్రేక్షకుల ముందుకు ఎప్పుడు రానుందనే విషయాన్ని చెబుతూ ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తోన్న అక్షయ్ కుమార్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. ఈ సినిమా టీజర్ వినాయకచవితి సందర్భంగా సెప్టెంబర్ 13న విడుదల కానుందని అక్షయ్ ట్వీట్ చేశాడు.

దీంతోపాటు 2.0 లో తమ పాత్రకు సంబంధించిన ఓ కొత్త పోస్టర్ ని విడుదల చేశాడు. ఎనిమిదేళ్ల క్రితం రజినీకాంత్-శంకర్ కాంబినేషన్ లో వచ్చిన రోబోకి సీక్వెల్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. లైకా ప్రొడక్షన్ దాదాపు 400 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. అమీ జాక్సన్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాకు ఏఆర్ రెహ్మాన్ స్వరకర్త. 

loader