Asianet News TeluguAsianet News Telugu

`18 పేజెస్‌` మొదటి వారం కలెక్షన్లు.. హిట్టా? ఫట్టా?

నిఖిల్‌, అనుపమా పరమేశ్వరన్‌ జంటగా నటించిన `18పేజెస్‌` చిత్రం గత వారం విడుదలైంది. పాజిటివ్‌ టాక్‌ని తెచ్చుకున్న ఈ సినిమా కలెక్షన్లని ప్రకటించింది యూనిట్‌.

18 pages movie first week collections
Author
First Published Dec 30, 2022, 8:50 PM IST

నిఖిల్‌, అనుపమా పరమేశ్వరన్‌ జంటగా నటించిన `18 పేజెస్‌` చిత్రం గత శుక్రవారం విడుదలైన విషయం తెలిసిందే. సరికొత్త లవ్‌ స్టోరీగా రూపొందిన ఈ సినిమాకి మొదట్నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది. క్రిటిక్స్ నుంచి ప్రశంసలు దక్కాయి. ప్యూర్‌ లవ్‌ స్టోరీగా మెప్పించింది. సినిమా క్లైమాక్స్ గురించి అంతా ప్రత్యేకంగా మాట్లాడారు. సినిమాకి అది హైలైట్‌గా నిలిచింది. డిపరెంట్‌ క్లైమాక్స్ గా ప్రశంసలందుకున్న ఈ చిత్రం కలెక్షన్ల పరంగానూ డీసెంట్‌గా మెప్పిస్తుంది. 

తాజాగా చిత్ర బృందం ఈ సినిమా కలెక్షన్లని ప్రకటించింది. ఇప్పటి వరకు కలెక్షన్ల మ్యాటర్‌ గురించి చర్చించని యూనిట్‌ ఇప్పుడు మొదటి వారం కలెక్షన్ల గ్రాస్‌ని వెల్లడించింది. మొదటి వారంలో ఇది రూ.20కోట్ల గ్రాస్‌ కలెక్ట్ చేసినట్టు వెల్లడించింది. ఈ లెక్కన ఇది దాదాపు ఎతొమ్మిది కోట్ల వరకు నెట్‌ వసూలు చేసిందని ట్రేడ్‌ వర్గాల సమాచారం. అయితే ఇది పూర్తిగా క్లాస్‌ ఫిల్మ్ కావడంతో మాస్‌, సీ సెంటర్లలో ఆశించిన స్థాయిలో ఆదరణ దక్కడం లేదనే టాక్‌ ఉంది. 

అయితే ఇప్పుడు డిసెంబర్‌ 31, న్యూ ఇయర్‌ స్పెషల్స్ ఈ సినిమాకి కలిసి రాబోతుంది. ఈ రెండు రోజుల్లో ఎక్కువగా యువత సినిమాలు చూసేందుకు ఆసక్తి చూపుతారు. 18పేజెస్‌ ప్యూర్‌ లవ్‌ స్టోరీ కావడంతో లవర్స్ ఈ సినిమాని చూసే అవకాశం ఉంది. దీంతో ఈ వీకెండ్‌ ఈ చిత్రానికి కలిసొచ్చేలా ఉంది. ఈ దెబ్బతో బ్రేక్ ఈవెన్‌ కావడంతోపాటు లాభాల్లోకి వెళ్లబోతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదంటున్నారు క్రిటిక్స్. మరి ఏ మేరకు సత్తా చాటుతుందో చూడాలి. 

సుమారు రూ.12కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రానికి 18కోట్ల నాన్‌ థియేట్రికల్‌ బిజినెస్‌ అయ్యింది. రిలీజ్‌ కి ముందే ప్రాఫిట్‌ ప్రాజెక్ట్ గా నిలిచింది. ఇప్పుడు వచ్చే కలెక్షన్లు అన్నీ బోనస్‌ అని చెప్పొచ్చు. అయితే అల్లు అరవింద్‌ చాలా వరకు ఓన్‌ రిలీజ్‌ చేయడం కూడా కలిసొచ్చే అంశం. ఇక `కుమారి 21ఎఫ్‌` ఫేమ్‌ పల్నాటి సూర్యప్రతాప్‌ దర్శకత్వం వహించగా, అల్లు అరవింద్‌ సమర్పణలో జీఏ2, సుకుమార్‌ రైట్స్ పతాకాలపై బన్నీ వాసు నిర్మించిన చిత్రమిది. సుకుమార్‌ కథ అందించారు.

ఈ సినిమా గురించి నిర్మాతలు చెబుతూ, `డిసెంబర్ 23 న క్రిస్టమస్ కానుకగా  ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఈ సినిమా మొదటి ఆటనుండే మంచి పాజిటివ్ టాక్ , రివ్యూస్ ను అందుకుంది. కమర్షియల్ సినిమాలు మాత్రమే కాదు ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీకి కూడా సరైన ఆదరణ లభిస్తుంది అని నిరూపించింది ఈ క్రేజి లవ్ స్టోరీ. ఈ సినిమాలో సిద్ధు, నందిని లా పాత్రలను మలిచిన తీరు, ఈ సినిమాలోని సాంగ్స్, కొన్ని అందమైన విజువల్స్, వీటన్నింటి మించి సుకుమార్ మార్క్ తో కూడిన క్లైమాక్స్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది. సినిమా విడుదల రోజు నుండి మౌత్ టాక్ తో రోజురోజుకు సినిమాకి ఆదరణ పెరుగుతూ వచ్చింది. ఈ సినిమాకి రిపీట్ ఆడియన్స్ వస్తున్నారు. తాజాగా ఈ సినిమా 20 కోట్ల గ్రాస్ సాధించి,విజయంతంగా ముందుకు సాగుతుంద`ని వెల్లడించారు.

Follow Us:
Download App:
  • android
  • ios