నిర్మాతగా మొన్నటివరకు సొంతంగా సినిమాలను నిర్మించుకున్న నందమూరి హీరో కల్యాణరామ్ ఇప్పుడిపుడే ఇతర ప్రొడక్షన్ హౌస్ లకు దగ్గరవుతున్నాడు. రీసెంట్ గా విడుదలయిన 118 సినిమాకు ఎలాంటి పారితోషికం తీసుకోకుండా నటించినట్లు టాక్.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

అది ఎంతవరకు నిజం అనే విషయాన్నీ పక్కనపెడితే ఇంతకుముందు వచ్చిన నా నువ్వే.. సినిమా దారుణంగా డిజాస్టర్ అవ్వడంతో ఇప్పుడు 118 సినిమా కూడా అదే ప్రొడక్షన్ హౌస్ లో చేశాడు. అయితే ఈ సినిమా అనుకున్నంత రేంజ్ లో అయితే ఓపెనింగ్స్ ను అందుకోలేకపోయింది. మొదటి కోటిన్నర షేర్స్ తో డీసెంట్ గా కలెక్షన్స్ స్టార్ట్ అయ్యాయి. 

టాక్ పరవాలేదు అనే విధంగా వస్తున్నప్పటికీ సినిమా మాస్ ఆడియెన్స్ ని అంతగా ఎట్రాక్ట్ చేయడం లేదు. ఇక ఇప్పటివరకు 4 కోట్ల షేర్స్ కూడా రాలేవని సమాచారం. 11 కోట్ల ప్రీ రిలీజ్ తో సిద్దమైన ఈ సినిమా ఇంకా 10 కోట్ల వరకు షేర్స్ అందుకుంటేనే బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ అయినట్లు. 

సోమవారం శివరాత్రి సెలవు కావడంతో కొంత లాభాలు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ తరువాత రోజులు కూడా అదే తరహాలో కలెక్షన్స్ కంటిన్యూ అవ్వడం సందేహంగానే ఉంది. పరీక్షా సమయంలో 118 ఎలాంటి వసూళ్లను అందుకుంటుందో చూడాలి.