Asianet News TeluguAsianet News Telugu

‘101 జిల్లాల అందగాడు’ రీమేకా? కథేంటి

బట్టతలతో కనిపించే గొత్తి సత్యనారాయణ పాత్రలో అవసరాల, ఆయన ప్రేయసి పాత్రలో రుహానీ కనిపించనున్నారు. అవసరాల హీరోగా నటించడంతోపాటు, అందరికీ కడుపుబ్బా నవ్వించే ఈ కథనీ అందించారు

101 Jillala Andagadu MOVIE STORY LINE
Author
Hyderabad, First Published Aug 15, 2021, 7:33 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

అవసరాల శ్రీనివాస్‌ టైటిల్‌ పాత్రలో నటించిన చిత్రం ‘101 జిల్లాల అందగాడు’.  రాచకొండ విద్యాసాగర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో రుహానీ శర్మ హీరోయిన్. దిల్‌రాజు - క్రిష్‌ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి.  కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఆగస్ట్ 27న రిలీజ్ చేయటానికి మొదట నిర్ణయించారు. అయితే అదే రోజున చాలా సినిమాలు రిలీజ్ కు ఉండటంతో వాయిదా వేసారు. సెప్టెంబర్ 3 ని కొత్త రిలీజ్ డేట్ గా ప్రకటించారు.

 ‘‘ప్రేమలో నిజాయతీ ఉండాలనుకునే అమ్మాయి... దొరక్క దొరికిన ప్రేమను, ప్రేయసిని వదులుకోకూడదనుకునే యువకుడు కొన్ని నిజాలను దాస్తాడు. ఆ నిజం బయటపడితే వారి ప్రేమలో ఎలాంటి పరీక్షలు ఎదురవుతాయి? అనే  పాయింట్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఇక గతంలో హిందీలో  ఆయుష్మాన్ ఖురానా హీరోగా బట్టతల వల్ల కలిగే ఇబ్బందులు ఎలా ఉంటాయో ఫన్నీగా చెప్తూ 'బాలా'అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి పెద్ద హిట్టైంది. ఈ సినిమాకి అమర్ కౌశిక్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా రీమేక్ అని ప్రచారం జరుగుతోంది. ‘‘బట్టతలతో కనిపించే గొత్తి సత్యనారాయణ పాత్రలో అవసరాల, ఆయన ప్రేయసి పాత్రలో రుహానీ కనిపించనున్నారు. అవసరాల హీరోగా నటించడంతోపాటు, అందరికీ కడుపుబ్బా నవ్వించే ఈ కథనీ అందించారు’’అని నిర్మాతలు చెప్తున్నారు.

‘‘నిజానికి ముందుగా ‘101 జిల్లాల అంద‌గాడు’చిత్రాన్ని ఆగ‌స్ట్ 27న విడుద‌ల చేయాల‌ని అనుకున్నాం. అలాగే విడుద‌ల తేదీని కూడా ప్ర‌క‌టించాం. అయితే అదే తేదిన మ‌రికొన్ని సినిమాలు విడుద‌ల‌వుతున్నాయి. ఎక్కువ సినిమాలు విడుద‌లైతే సినిమా నిర్మాత‌లే న‌ష్ట‌పోవాల్సి ఉంటుంది. అలా జ‌ర‌గ‌కుండా అంద‌రూ బావుండాల‌నే స‌దుద్దేశంతోమా ‘101 జిల్లాల అంద‌గాడు’ చిత్రాన్ని సెప్టెంబ‌ర్ 3న విడుద‌ల చేయాల‌ని నిర్ణ‌యించుకున్నాం’’ అని నిర్మాత‌లు తెలిపారు.

అలాగే శ‌క్తికాంత్ కార్తీక్ సంగీతం అందించిన ఈ సినిమాకు సంబంధించిన వీడియో ప్రోమో, టీజ‌ర్‌, టైటిల్ సాంగ్‌తో పాటు ‘మనసా వినవా..’ లిరిక‌ల్ సాంగ్‌కు ప్రేక్ష‌కుల నుంచి చాలా మంచి స్పంద‌న వ‌చ్చింది. సినిమా ఎలా ఉండ‌బోతుందోన‌ని ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తి క్రియేట్ అయ్యింది. టాలీవుడ్‌లో డిఫ‌రెంట్ మూవీస్‌లో న‌టుడిగా,సెన్సిబుల్ డైరెక్ట‌ర్‌గా, రైట‌ర్‌గా త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్న అవ‌స‌రాల శ్రీనివాస్ `101 జిల్లాల‌ అంద‌గాడు` చిత్రంలో హీరోగా న‌టించ‌డ‌మే కాకుండా త‌న‌దైన కామెడీ పంచుల‌తో ప్రేక్ష‌కులు ఎంజాయ్ చేసేలా మంచి ఎంట‌ర్‌టైనింగ్ క‌థ‌ను అందించారు. రామ్ సినిమాటోగ్ర‌ఫీ, శ‌క్తికాంత్ కార్తీక్ సంగీతం అందిస్తున్నారు అని చెప్పుకొచ్చారు.

న‌టీన‌టులు:
అవ‌స‌రాల శ్రీనివాస్‌, రుహానీ శ‌ర్మ త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:
ద‌ర్శ‌క‌త్వం: రాచ‌కొండ విద్యాసాగ‌ర్‌
స‌మ‌ర్ప‌ణ‌: దిల్‌రాజు, జాగ‌ర్ల‌మూడి క్రిష్‌
నిర్మాత‌లు: శిరీష్‌, రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగ‌ర్ల‌మూడి
ర‌చ‌యిత‌: అవ‌స‌రాల శ్రీనివాస్‌
సినిమాటోగ్ర‌ఫీ: రామ్‌
ఎడిట‌ర్‌: కిర‌ణ్ గంటి
సంగీతం: శ‌క్తికాంత్ కార్తీక్‌
ఆర్ట్‌: ఎ.రామాంజ‌నేయులు
డిజైన‌ర్‌: ఐశ్వ‌ర్యా రాజీవ్

Follow Us:
Download App:
  • android
  • ios