1000 మంది ఫైటర్స్ తో ‘గేమ్ ఛేంజర్’ క్లైమాక్స్.. యాక్షన్ సీక్వెన్స్ కోసం భారీ సెట్..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - శంకర్ కాంబోలో రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘గేమ్ ఛేంజర్’. ప్రస్తుతం ఈ చిత్రం క్లైమాక్స్ షూటింగ్  జరగనుంది. దీనిపై అదిరిపోయే అప్డేట్ అందింది. 
 

1000 fighters for Game Changer movie Climax NSK


గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan)- క్రియేటివ్ డైరెక్టర్ ఎస్ శంకర్ దర్శకత్వంలో Game Changer రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే.  శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత చరణ్ నటిస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. మొదటి నుంచి సినిమాపై అంతకంతకూ ఆసక్తి  పెరుగుతూనే వస్తోంది. ఈక్రమంలో సినిమా నుంచి అదిరిపోయే న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.

‘గేమ్ ఛేంజర్’ షూటింగ్ ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం క్లైమాక్స్ ను చిత్రీకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని తెలుస్తోంది. ఏకంగా 1000 మంది ఫైటర్స్ తో భారీ యాక్షన్ సీక్వెన్స్ ను రూపొందించారని టాక్ వినిపిస్తోంది. ఈ ఫైట్ సీన్ కోసం హైదరాబాద్ శివార్లో సెట్ వర్క్ కూడా పూర్తి చేశారంట. మరో నాలుగైదు రోజుల్లో క్లైమాక్స్ చిత్రీకరణ మొదలు కానుంది.  ‘కేజీఎఫ్’ యాక్షన్ కొరియోగ్రాఫర్ అన్బు అండ్ అరివు ‘గేమ్ ఛేంజర్’ క్లైమాక్స్ ను కొరియోగ్రాఫ్ చేయనున్నారని తెలుస్తోంది. 

పొలిటికల్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ - కియారా అద్వానీ జంటగా నటిస్తున్నారు. కేరీర్ లో తొలిసారిగా చరణ్ ద్విపాత్రినభియం చేస్తున్నారు. చరణ్ బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన టైటిల్ పోస్టర్, ఫస్ట్ లుక్ పోస్టర్ కు భారీ రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రస్తుతం క్లైమాక్స్ పైనా అంచనాలు పెంచుతున్నారు. ఇప్పటికే సాంగ్స్, డాన్స్ విషయంలోనూ ఏమాత్రం తగ్గడం లేదు. 

యాక్షన్స్ తో దుమ్ములేపబోతున్న చరణ్.. అటు డాన్స్ తోనూ ఇరగదీయనున్నారు. ఈ చిత్రం  కోసం ఏకంగా ఇండియాలోనే టాప్ 6 కొరియోగ్రాఫర్స్ వర్క్  చేశారు. అంటే వెండితెరపై చరణ్ ఏ రేంజ్ లో స్టెప్పులేయబోతున్నారో అర్థమవుతోంది. చిత్రంలో అంజలి, ఎస్జే సూర్య, జయరామ్, సునీల్, శ్రీకాంత్, సముద్రఖని, నవీన్ చంద్ర, నాజర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. థమన్ సంగీతం సమకూర్చుతున్నారు. రిలీజ్ విషయానికొస్తే వచ్చే ఏడాది సంక్రాంతి లేదంటే సమ్మర్ లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios