Asianet News TeluguAsianet News Telugu

100కోట్ల పోస్టర్..ఎంతవరకు నిజం?

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఏడాది బిజినెస్ పెరుగుతుందనేది వాస్తవం. అప్పుడెప్పుడో మొదటి కోటి రూపాయల కలెక్షన్స్ అందుకున్న మయా బజార్ చిత్రం నుంచి ఇప్పుడు వస్తున్న చిత్రాలు ఒక్కొక్కొటిగా నెంబర్ ను పెంచుతూ 100 కోట్లకు దాటించేస్తున్నాయి. 

100 crores postar real or fake
Author
Hyderabad, First Published Oct 15, 2018, 8:27 PM IST

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఏడాది బిజినెస్ పెరుగుతుందనేది వాస్తవం. అప్పుడెప్పుడో మొదటి కోటి రూపాయల కలెక్షన్స్ అందుకున్న మయా బజార్ చిత్రం నుంచి ఇప్పుడు వస్తున్న చిత్రాలు ఒక్కొక్కొటిగా నెంబర్ ను పెంచుతూ 100 కోట్లకు దాటించేస్తున్నాయి. ఇక స్టార్ హీరోలు మరికొందరు 200కోట్ల మార్క్ ను కూడా అందుకుంటున్నారు. అయితే కొంత మంది హీరోల లెక్కల్లో మాత్రం తేడాలు ఉన్నట్లు టాక్ వస్తోంది. 

నేషనల్ మీడియాలో కూడా టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ రిపోర్టుల గురించి చాలా సార్లు ప్రత్యేక కథనాలు వెలువడ్డాయి. కలెక్షన్స్ విషయంలో ఎక్కువగా హడావుడి చేసేది టాలీవుడ్ వాళ్లే అంటూ ట్యాగ్ లైన్లు ఇచ్చారు. సినిమాకు హైప్ తేవడానికి ఇది కూడా ఒక ప్రమోషన్ లాంటిదే అని అందుకే 100 కోట్ల పోస్టర్లు చాలా స్పీడ్ గా వస్తున్నాయని చెబుతున్నారు. 

గతంలో ఈ న్యూస్ ఎక్కువగా వచ్చినప్పుడు రంగస్థలం యూనిట్ కొంత నిధానంగా వ్యవహరించింది. లెక్కల్లో అందరికి ఒక క్లారిటీ వచ్చే వరకు 100 కోట్ల పోస్టర్ ని రిలీజ్ చెయ్యలేదు. అయితే భరత్ అనే నేనుపై మాత్రం కొంత నెగిటివ్ టాక్ వచ్చింది. సినిమా 200 కోట్లు దాటేసిందని స్పీడ్ గా పోస్టర్లు దర్శనమివ్వడం చర్చనీయాంశంగా మారిన సంగతి తెల్సిందే. 

ఇక ఇప్పుడు అరవింద సమేత మూడు రోజులకే 100 కోట్ల గ్రాస్ ను అందుకుందనే పోస్టర్స్ కనిపించడంపై కూడా భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. సినిమాకు కొంత నెగిటివ్ టాక్ వచ్చింది నిజమే. అంచనాలను అందుకోలేదని అభిప్రాయపడ్డవారు ఉన్నారు. ఇక సినిమాకు వచ్చిన క్రేజ్ ను బట్టి మంచి కలెక్షన్స్ ను అందుకుందన్నది వాస్తవమే. కానీ వంద కోట్ల పోస్టర్ స్పీడ్ గా కనిపించడమే డౌట్ గా ఉందనే టాక్ వైరల్ అవుతోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే పంపిణీదారులే క్లారిటీ ఇవ్వాలి.

Follow Us:
Download App:
  • android
  • ios