‘పుష్ప 2’ఓవర్ సీస్ రైట్స్ అంత చెప్తున్నారా? ,షాకింగ్ ప్రైస్
2024 ఆగస్టు 15వ తేదీన పుష్ప 2 సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ క్రమంలో చిత్రం బిజినెస్ ఊపందుకుంది.

ఓవర్ సీస్ మార్కెట్,ఓటిటి మార్కెట్ ఇవే ఇప్పుడు పెద్ద సినిమాలకు పెద్ద దిక్కుగా మారాయి. అవి ఎంత వస్తాయనేదానిపైనే మిగతా విషయాలన్ని ఆధాపడి ఉన్నాయి. అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ‘పుష్ప 2: ది రూల్’కు ఏ రేంజి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ఈ మూవీ కోసం సినీ లవర్స్ ఎదురుచూస్తున్నారు. 2021లో పుష్ప 1: ది రైజ్ మూవీ దేశవ్యాప్తంగా ఘన విజయం సాధించటమే అందుకు కారణం. పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎదిగారు. ఈ చిత్రానికి సీక్వెల్‍గా ఇప్పుడు ‘పుష్ప 2: ది రూల్’ రూపొందుతోంది.
సుకుమార్ మొదటి పార్ట్ కంటే ఈ సీక్వెల్‍ను మరింత భారీగా తెరకెక్కిస్తున్నారు. 2024 ఆగస్టు 15వ తేదీన పుష్ప 2 సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ క్రమంలో చిత్రం బిజినెస్ ఊపందుకుంది. ఓవర్ సీస్ రైట్స్ విషయమై ఇప్పుడో అనీఫిషయల్ అప్డేట్ బయిటకు వచ్చింది. ఈ చిత్రం ఓవర్ సీస్ రైట్స్ 100 కోట్లు కోట్ చేస్తున్నట్లు ట్రేడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే అరవై కోట్లు వరకూ అయితే రైట్స్ తీసుకున్న డిస్ట్రిబ్యూటర్స్ ఒడ్డునపడతారని అంతకుమించి అయితే కష్టమని అంటున్నారు.
ఏ ఏరియాకు ఎంత అనేది లెక్క వేసుకుని అవకాసం ఉంటే ముందే అడ్వాన్స్ లు ఎగ్రిమెంట్స్ చేసుకునే విధంగా మాట్లాడుకుని ఓవర్ సీస్ రైట్స్ తీసుకుందామని అక్కడ బయ్యర్లు ప్లాన్ చేస్తున్నారట. ఈ క్రమంలో ఖచ్చితంగా బేరసారాలు జరుగుతాయి. ఎంతకు ఫైనల్ అవుతుంనేది ప్రస్తుతానికి సస్పెన్సే. మరో ప్రక్క పుష్ప 2: ది రూల్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల ఒప్పందం పూర్తయిందని అంటున్నారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్‍ఫామ్ నెట్‍ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను కైవసం చేసుకున్నట్టు సమాచారం. థియేట్రికల్ రన్ పూర్తయ్యాక తమ ప్లాట్‍ఫామ్‍లో ఈ మూవీని స్ట్రీమింగ్ చేసుకునేందుకు నెట్‍ఫ్లిక్స్ డీల్ కుదుర్చుకుందని వెల్లడైంది. రికార్డు ధరకు పుష్ప 2 డిజిటల్ రైట్స్ అమ్ముడుపోయాట.