దర్శకధీరుడు రాజమౌళి, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో వచ్చిన మగధీర చిత్రం మంగళవారంతో 10 ఏళ్ళు పూర్తి చేసుకుంది. తెలుగు సినిమా చరిత్రలో అద్భుత విజయంగా నిలిచిపోయిన మగధీరని అభిమానులు మరొక్కసారి గుర్తుచేసుకుంటూ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. 

కాజల్ అగర్వాల్, రాంచరణ్ జంటగా నటించ ఈ ఎమోషనల్ లవ్ స్టోరీని రాజమౌళి తనదైన శైలిలో దృశ్యకావ్యంలా మలిచారు. తెలుగు సినిమాకు భారీ తనం అంటే ఏంటో తొలిసారి చూపించిన చిత్రం మగధీర. పదేళ్లు పూర్తయిన సందర్భంగా రాంచరణ్, కాజల్ అగర్వాల్, గీతా ఆర్ట్స్ సంస్థ సోషల్ మీడియాలో స్పందించింది. 

అభిమానులు ఈ చిత్రంలో మెమొరబుల్ మూమెంట్స్ ని గుర్తుచేసుకుంటున్నారు. పదేళ్ళైపోయింది.. కానీ నాకు మాత్రం రీసెంట్ గానే విడుదలైనట్లు ఉంది అని రాంచరణ్ తెలిపాడు. కాజల్ అగర్వాల్ స్పందిస్తూ.. ఈ చిత్రంలో నటించడం నాకు ఓ అద్భుతమైన అనుభూతి. నా జీవితంపై ప్రభావం చూపిన చిత్రం ఇది. ఇందులో అవకాశం ఇచ్చిన రాజమౌళి సర్ కు థాంక్యూ అని కాజల్ ట్వీట్ చేసింది.