బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం 'జీరో'. ఇటీవల ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ట్రైలర్ ద్వారా సినిమా ఎలా ఉండబోతుందనే విషయాన్ని వెల్లడించింది చిత్రబృందం. 

ఈ సినిమాలో షారుఖ్ మరుగుజ్జు పాత్రలో నటించగా.. దివ్యాంగురాలిగా అనుష్క కనిపించనుంది. భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా ఇప్పుడు వివాదంలో ఇరుక్కుంది. ఈ సినిమాలో తమ మనోభావాలు కించపరిచే సన్నివేశాలు ఉన్నాయంటూ సిక్కులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

ఈరోజు ఢిల్లీ సిక్కు గురుద్వార్ కమిటీ జనరల్ సెక్రటరీ మజిందర్ సింగ్ సిర్సా ఢిల్లీ పోలీస్ స్టేషన్ లో షారుఖ్ తో పాటు చిత్ర దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ లపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ సినిమా ట్రైలర్ లో షారుఖ్ ఖాన్.. సిక్కులు పవిత్రంగా భావించే గట్రాకిర్పాన్ ధరించాడని, సిక్కుల సంప్రదాయం ప్రకారం అమ్రిత్ ధరి సిక్కులు మాత్రమే దాన్ని ధరిస్తారని.. కానీ షారుక్ దాన్ని ధరించి తమ మనోభావాలను కించపరిచాడని ఫైర్ అయ్యారు. వెంటనే సినిమాలో ఈ సన్నివేశాలను తొలగించి.. దర్శకుడు, హీరోపై చర్యలు తీసుకోవాలని మజిందర్ కంప్లైంట్ లో పేర్కొన్నారు. 

ఇది కూడా చదవండి.. 

జీరో: పొట్టి షారుక్ హార్ట్ ని టచ్ చేశాడు!