Asianet News TeluguAsianet News Telugu

జీరో: పొట్టి షారుక్ హార్ట్ ని టచ్ చేశాడు!

బాలీవుడ్ లో కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ గత కొంత కాలంగా వరుస అపజయాలను ఎదుర్కొంటున్నాడు. సాధారణంగా ఒక ఫెయిల్యూర్ అందితే వెంటనే కమర్షియల్ ఫార్మాట్ లో అన్ని ఈక్వల్ గ మెయింటైన్ చేసి ఒడ్డున పదతారు. కానీ షారుక్ మాత్రం మరగుజ్జు పాత్ర చేయడానికి ఒప్పుకున్నాడు. 

sharuk khan heart touching in zero
Author
Hyderabad, First Published Nov 2, 2018, 8:24 PM IST

బాలీవుడ్ లో కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ గత కొంత కాలంగా వరుస అపజయాలను ఎదుర్కొంటున్నాడు. సాధారణంగా ఒక ఫెయిల్యూర్ అందితే వెంటనే కమర్షియల్ ఫార్మాట్ లో అన్ని ఈక్వల్ గ మెయింటైన్ చేసి ఒడ్డున పదతారు. కానీ షారుక్ మాత్రం మరగుజ్జు పాత్ర చేయడానికి ఒప్పుకున్నాడు. నటుడిగా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న షారుక్ కి జీరో సినిమా ఒక ఛాలెంజ్ అని చెప్పాలి. 

సినిమా ట్రైలర్ ను చిత్ర యూనిట్ ఈ రోజు రిలీజ్ చేసింది.పోటో చూసి అనుష్క శర్మ ప్రేమలో పడే షారుక్ ఆమెను డైరెక్ట్ గా చూసిన తరువాత తనకంటే అతి వైకల్యం కలిగిన అమ్మాయి అని షాక్ అవుతాడు. ఆమెతో సరదాగా గడుపుతున్న సన్నివేశాలను ట్రైలర్ లో అద్భుతంగా చూపించారు. ఇక కత్రినా స్టార్ గా షారుక్ తో ఉండటం ఆ తరువాత హీరో ఎలా జీరో అయ్యాడు అనే అంశం ఆసక్తికరంగా ఉంది. 

షారుక్ టాలెంట్ ఏంటో రెండు మూడు సీన్స్ లోనే తెలిసిపోయింది. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ లో అతని నటించిన విధానం ట్రైలర్ లోనే ఇలా ఉందంటే బడా స్క్రీన్ పై చూసిన తరువాత హార్ట్ ని టచ్ చేయడం ఖాయమని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా డిసెంబర్ 21న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

 

                                                                       

Follow Us:
Download App:
  • android
  • ios