సినిమా, టీవి ఈ రెండు గ్లామర్ ఫీల్డులే ,కాదనలేం. అందుకోసం హీరోయిన్స్ తమ సహజమైన  సౌందర్యాన్ని వదిలేసి కృత్రిమ సౌందర్యం కోసం పాకులాడితే మాత్రం ఒక్కోసారి ఇబ్బందికరమైన పరిస్దితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్లాస్టిక్ సర్జరీలు వంటివి చేయించుకుని కొంతమంది హీరోయిన్లు ఇండస్ట్రీని ఏలినా...చాలామంది మాత్రం తమ అందాన్ని శాశ్వతంగా కోల్పోయారు. ఇప్పుడు అదే పరిస్దితి మౌనీరాయ్ కు ఎదురైందా అనే సందేహాలు నెటిజన్లు వెల్లబుచ్చుతున్నారు. 

వివరాల్లోకి వెళితే...‘నాగినీ’ సీరియల్‌ స్టార్‌, బాలీవుడ్‌ హీరోయిన్ అయిన మౌనీ రాయ్‌ రీసెంట్ గా సల్మాన్‌ ఖాన్‌ కొత్త చిత్రం‘భారత్‌’ సినిమా ప్రీమియర్‌కు హాజరయ్యింది. దాంతో ఈ ఈవెంట్‌కు సంబంధించిన ఆమె ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో దర్శనమిచ్చాయి. దాంతో ట్రోల్స్‌ ఒక్కసారిగా విరుచుకుపడ్డాయి. 

ఇనిస్టాగ్రమ్‌లో పోస్టు చేసిన ఆమె ఫొటోలపై నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఆమె పెదవులపై అందరి దృష్టి పడుతోంది.  మీ పెదవులకు ఏమైంది.. సర్జరీ ఫెయిలైందా? అంటూ ప్రశ్నలతో రెచ్చిపోతున్నారు. 

మీడియాలో అయితే మౌనీరాయ్‌ ప్లాస్టిక్‌ సర్జరీలతో తన సహజ అందాన్ని పాడు చేసుకుందని అని ప్రచారం చేస్తున్నారు. ఉన్న సహజమైన అందం సరిపోదన్నట్లు మరింత అందం కోసం చేయించుకున్న సర్జరీలు సక్సెస్‌ కాకపోవడంతో ఆమె వికారంగా తయారైందని విమర్శలు గుప్పిస్తూ కథనాలు వస్తున్నాయి. కొందరైతే ఇంకాస్త ముందుకు వెళ్ళి ప్లాస్టిక్‌ సర్జరీల కారణంగా మౌనీరాయ్‌.. రాఖీ సావంత్‌లా కనిపిస్తోందని, మైఖేల్‌ జాక్సన్‌లా మారిందని కామెంట్లు పెడుతున్నారు.

రీసెంట్ గా జాన్ అబ్రహం హీరో గా వచ్చిన ‘రోమియో అక్బర్ వాల్టర్, మూవీ లో కనిపించిన మౌని రాయ్ ప్రస్తుతం మేడ్ ఇన్ చైనా, బ్రహ్మాస్త్ర, మొఘల్ చిత్రాలలో నటిస్తోంది.