దుల్కర్ సల్మాన్, మరాఠీ భామ మృణాల్ ఠాకూర్ జంటగా చేస్తున్న సినిమా ‘సీతారామం’. హను రాఘవపూడి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్‌లో సి.అశ్వనీదత్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వివిధ పాత్రలకు సంబంధించిన లుక్స్ విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది.
మళయాళ సూపర్ స్టార్ హీరో దుల్ఖర్ సల్మాన్ (Dulquer Salman) హీరోగా నటిస్తున్న రెండో స్ట్రైట్ తెలుగు సినిమా ‘సీతారామం’ (Sitaramam). మృణాళ్ ఠాకూర్ (Mrinal Thakur) హీరోయిన్ గా నటించింది. యుద్ధంతో రాసిన ప్రేమకథ దీనికి ట్యాగ్ లైన్. స్వప్న సినిమాస్ (Swapna Cinemas) బ్యానర్ పై, వైజయంతి మూవీస్ సమర్పణలో, హనురాఘవపూడి (Hanu Raghavapudi) దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఆగస్ట్ 5న ఈ సినిమా థియేటర్స్ విడుదల కాబతోంది. అయితే లాస్ట్ మినిట్ లో ఈ సినిమా దుబాయి రిలీజ్ కు సమస్యలు వచ్చాయి.
ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ కాగా, గల్ఫ్ దేశాల్లో ఈ సినిమా రిలీజ్‌కు సెన్సార్ నో చెప్పినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాలో మతపరమైన కొన్ని సీన్స్ ఉన్నాయని, అందువల్లే ఈ సినిమాను గల్ఫ్‌లో రిలీజ్ చేయొద్దంటూ సెన్సార్ తెలిపిందని వినిపిస్తోంది. అయితే తమ సినిమాను గల్ఫ్ దేశాల్లో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రీసెన్సార్ చేయించనుందిట. ఈ మేరకు సెన్సార్ బోర్డు ముందుకు వెళ్లనుందట.
దుల్కర్ కు గల్ఫ్ దేశాల్లో మంచి మార్కెట్ ఉంది. సినిమా హిట్టైతే దాదాపు పది కోట్లు వరకూ వసూలు చేస్తుంది. ఈ నేపధ్యంలో ఈ సినిమాను గల్ఫ్ దేశాల్లో నిజంగానే బ్యాన్ చేస్తే భారీ లాసే. ఈ క్రమంలో సినిమా రిలీజ్ ఆపేస్తారా లేక ఇబ్బంది కరంగా ఉన్న సీన్స్‌ను తొలగించి అక్కడ రిలీజ్ చేస్తారా అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
తెలుగు తో పాటు తమిళ, మలయాళ వెర్షన్స్ లోనూ చిత్రం విడుదల కానుంది. ఇంతకు ముందు విడుదలైన ఈ సినిమా టీజర్, ట్రైలర్ , సింగిల్స్ కు మంచి స్పందన లభించింది. తాజాగా ‘సీతారామం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ప్రభాస్ వచ్చారు.
ఇక 20 ఏళ్ళ క్రితం లెఫ్టినెంట్ రామ్ నాకో బాధ్యత అప్పగించారు. ఈ ఉత్తరాన్ని సీతామహాలక్ష్మికి నువ్వే చేర్చాలి’ అనే పాయింట్ చుట్టూనే సినిమా కథ నడుస్తుంది. ఆ ఉత్తరం పట్టుకొని జర్నలిస్ట్ ఆఫ్రిన్ (రష్మికా) ప్రయాణం మొదలు పెడుతుంది. పదిరోజుల్లో ఆ ఉత్తరం సీతకు అప్పగించడమే తన లక్ష్యం. అయితే ఆ పేరుతో ఎవరూ లేరని తెలుస్తుంది. అయినా సరే సీతకోసం అన్వేషణ మొదలవుతుంది. 1965 నేపథ్యంలో సాగే ఈ ప్రేమకథ ఎంతో హృద్యంగా ఉండబోతోందని ట్రైలర్ ను బట్టి అర్దమవుతోంది.
ప్రకాష్ రాజ్, తరుణ్ భాస్కర్, మురళీ శర్మ, సుమంత్ , భూమిక ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ సినిమాలోని చాలా భాగం కశ్మీర్ లో చిత్రీకరించారు. అలాగే.. కశ్మీర్ లోయలోని ప్రపంచంలోనే ఎత్తైన పోస్టాఫీస్ లో దుల్ఖర్ సల్మాన్ లెటర్స్ పోస్ట్ చేసే సన్నివేశాల్ని చిత్రీకరించారు. ఆ క్రమంలో చిత్ర యూనిట్ చాలా కష్టాలు పడిందని దర్శకుడు హను చెప్పాడు. యుద్ధానికి సిద్ధంగా ఉన్న ఒక యువకుడు ఒక అందమైన అమ్మాయి ప్రేమలో పడితే జరిగే పరిణామాల్ని.. ఈ సినిమాలో ఎంతో అందంగా చూపించబోతున్నారు. విశాల్ చంద్రశేఖర్ (Vishal Chandrasekhar) సంగీతం అందించిన ఈ పిరియాడికల్ లవ్ స్టోరీ ఏ స్థాయిలో ప్రేక్షకాదరణ పొందుతుందో చూడాలి.
