Asianet News TeluguAsianet News Telugu

Box office: రేపటితో USAలో ఈ రెండు సినిమాల ఎగ్జిబిటర్స్ ...

కొన్ని రోజులుగా వరుస ఫ్లాపులని ఎదుర్కుంటున్న టాలీవుడ్ కి ఇటీవల రిలీజ్ అయిన బింబిసార, సీతారామం సినిమాలు హిట్ కొట్టి ఊపిరి పోశాయి. దీంతో టాలీవుడ్ ప్రముఖులంతా ఈ సినిమాలని, చిత్ర యూనిట్స్ ని అభినందిస్తున్నారు. కలెక్షన్స్ విషయానికి ఎవరూ ఊహించని విధంగా ఇవి దూసుకుపోతున్నాయి. ఈ నేపధ్యంలో   USA లో పరిస్దితి ఏంటో చూద్దాం. 

#SitaRamam and #Bimbisara will breakeven tomorrow
Author
California, First Published Aug 9, 2022, 1:01 PM IST


తెలుగు పరిశ్రమ గత కొంత కాలంగా  వరుస పరాజయాల ఎదుర్కొంటోంది. థియేటర్ కు అసలు జనం వస్తారా రారా అనే విషయాలపై మీటింగ్ లు పెట్టుకుంటోంది. ఓటిటి నే  పెద్ద దెబ్బగా భావించి పీక నొక్కాలని ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో  తాజాగా విడుదలైన రెండు చిత్రాలు హిట్ టాక్ సొంతం చేసుకున్నాయి. శుక్రవారం విడుదలైన బింబిసార, సీతారామం చిత్రాలు విజయం సాధించాయి. కల్యాణ్ రామ్ హీరోగా నటించిన బింబిసార, మలయాళ  నటుడు దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్ర పోషించిన సీతారామం హిట్ టాక్ తో పాటు మంచి వసూళ్లు కూడా సాధిస్తున్నాయి.

అదే సమయంలో ఈ రెండు  సినిమాల  USA లో ఎగ్జిబిటర్స్ ..రేపటితో బ్రేక్ ఈవెన్ సాధించబోతున్నట్లు సమాచారం. దాంతో అక్కడ పండగ వాతావరణం కనపిస్తోంది. యుఎస్ మార్కెట్ లో చాలా నెలల తర్వాత భారీ సక్సెస్ సాధించిన సినిమాలు ఇవి.  ఇక బింబిసార గ్లోబల్ థియేట్రికల్ హక్కులు రూ. 15 కోట్లకు అమ్ముడయ్యాయి. ఈ మొత్తం మూడు రోజుల్లోనే రికవరీ అయ్యింది.

మరోవైపు  సీతారామం తొలి రెండు రోజుల్లో రూ. 10 కోట్ల వసూళ్లు రాబట్టింది. శుక్రవారం రూ. 3.80 కోట్లు సాధించిన ఈ చిత్రం శనివారం మాత్రం రూ. 6.20 కోట్ల వసూళ్లు నమోదు చేసింది. ఒక్క రోజులోనే కలెక్షన్లలో జంప్ దాదాపు 60 శాతం పెరిగింది.  తెలుగు రాష్ట్రాల వెలుపల కూడా భారీ వృద్ధిని సాధించింది. కేరళలో దాదాపు 80 శాతం వృద్ధి సాధించింది. ఈ చిత్రం వీకెండ్ లో  రూ. 18 కోట్లు సాధించిని అంచనా. సోమవారం కూడా అంతటా కలెక్షన్స్  స్టడీగా ఉన్నాయి. 

దిల్ రాజు మాట్లాడుతూ.. ”ఆగస్టు 1 నుంచి సినిమా షూటింగ్స్ లు నిలిపివేసి భవిష్యత్ కోసం ఆలోచనలు చేస్తున్నాం. జూన్ లో విక్రమ్, మేజర్ సినిమాలు మంచి విజయాలు అందుకున్నాయి. ఆ తర్వాత నుంచి ఒక్క సినిమా కూడా ఆడలేదు, జనాలు థియేటర్లకు రావడం లేదు. ఆగస్టులో బింబిసార, సీతారామం సినిమాలు ఇండస్ట్రీకి ఊపిరిపోశాయి. సినీ పరిశ్రమ చాలా ఇబ్బందుల్లో ఉందనడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఇండస్ట్రీ కష్టకాలంలో ఉన్న సమయంలో దర్శకుడు వశిష్ట ఇండస్ట్రీకి హిట్ ఇచ్చాడు. ఒక సినిమాకు దర్శకుడు, నిర్మాత, హీరోనే ముఖ్యం. ఈ ముగ్గురు ఉంటేనే సినిమాని ఏ స్థాయికైనా తీసుకెళ్లొచ్చు” అని అన్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios