Asianet News TeluguAsianet News Telugu

#SaakiniDaakini:టైమ్ చూసి సురేష్ బాబు వదులుతున్నారు, హిట్ కొడ్తారా?

కొరియన్‌ చిత్రం 'మిడ్‌ నైట్‌ రన్నర్స్‌'(Midnight Runners) ఆధారంగా తెలుగులో ఓ సినిమా రూపొందుతోంది. రెజీనా కసెండ్రా (Regina Cassandra), నివేదా థామస్‌ (Nivetha Thomas) ప్రధాన పాత్రల్లో దర్శకుడు సుధీర్‌ వర్మ(Sudheer Varma) తెరకెక్కిస్తున్నారు.  

#SaakiniDaakini releasing in theatres on 16th September
Author
Hyderabad, First Published Aug 16, 2022, 5:32 PM IST


 నివేదా థామస్‌. తాజాగా ఈ అమ్మడు తనలోని మరో షేడ్‌ని బయటకు తీసుకొచ్చేందుకు ఓ కొరియన్‌ రిమేక్‌తో మన ముందుకు రాబోతోంది. అయితే ఈ అమ్మాయి ఒక్కతే కాదు.. జంటగా సీనియర్ హీరోయిన్ రెజీనాను కూడా వెంట తీసుకువస్తోంది.

యంగ్ హీరోయిన్స్  రెజీనా కసెండ్రా(Regina Cassandra), నివేదా థామస్ (Nivetha Thomas)​ ప్రధానపాత్రల్లో ఓ యాక్షన్​ చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. కొరియన్​ సినిమా 'మిడ్​ నైట్​ రన్నర్స్​'(Midnight Runners) ఆధారంగా రూపొందుతోన్న ఈ చిత్రానికి 'శాకినీ-ఢాకినీ'(Sakini Dakini) అనే టైటిల్​ పెట్టారు. షూటింగ్ ఎప్పుడో పూర్తైన ఈ చిత్రం ఇప్పుడు తెలుగు పరిశ్రమ పరిస్దితి బాగుండటంతో   రిలీజ్ కు రెడీ చేసారు.

కొరియన్ మాతృకలో ఇద్దరు యువకులు లీడ్ రోల్స్ ప్లే చేశారు. అయితే తెలుగు నేటివిటికి తగ్గట్టుగా ఆ పాత్రలను అమ్మాయిలకు అన్వయించారు దర్శకుడు. సురేష్ ప్రొడక్షన్స్ స్వయంగా రిలీజ్ చేస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 16న భారిగా విడుదల కానుంది. ఈ విషయాన్ని  అఫిషీయల్‌గా అనౌన్స్ చేశాడు.  మొదటి ఈ చిత్రం డైరక్ట్ ఓటిటికి ఇస్తామని సురేష్ బాబుతెలిపారు. కానీ ఇప్పుడు మారిన పరిస్దితుల్లో జనం థియేటర్స్ కు తరిలి వస్తూండటంతో థియేటర్స్ కు ఇచ్చినట్లు తెలుస్తోంది. అలాగే ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ ని 'స్టార్ మా' ఛానెల్ సొంతం చేసుకుంది. 

పోలీస్ ఆఫీసర్ ట్రైనీలుగా ఉండే ఇద్దరు అమ్మాయిలు ఉమెన్ ట్రాఫికర్స్ ముఠాలతో తలపడాల్సి వస్తుంది. ఈ గ్యాంగ్స్ నుండీ తమని తాము ఎలా రక్షించుకున్నారు? మిగిలిన వారిని ఎలా రక్షించారన్నదే ఈ చిత్ర కథ. పూర్తి యాక్షన్‌ డ్రామాగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాను దగ్గుబాటి సురేశ్‌ బాబు, సునీత తాటి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీలో నివేదా- రెజినా క్యారెక్టర్స్‌ డిఫరెంట్‌గా ఉంటాయని ఇండస్ట్రీ టాక్‌. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో వున్న ‘‘శాకిని- డాకిని’’ ని  సెప్టెంబర్ 16న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.

Follow Us:
Download App:
  • android
  • ios