Asianet News TeluguAsianet News Telugu

నా బ్రెస్ట్ మీద చేతులేసి.. నటి షాకింగ్ కామెంట్స్!

బాలీవుడ్ లో పలువురు సినీనటులపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తోంది నటి తనుశ్రీదత్తా. దీంతో బాలీవుడ్ లో ఇదొక హాట్ టాపిక్ గా మారింది. చాలా మంది తారలు తాను ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి ధైర్యంగా బయటకొచ్చి చెబుతున్నారు.

'Once a male friend grabbed my breast at an airport', says filmmaker Pooja Bhatt
Author
Hyderabad, First Published Oct 6, 2018, 2:13 PM IST

బాలీవుడ్ లో పలువురు సినీనటులపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తోంది నటి తనుశ్రీదత్తా. దీంతో బాలీవుడ్ లో ఇదొక హాట్ టాపిక్ గా మారింది. చాలా మంది తారలు తాను ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి ధైర్యంగా బయటకొచ్చి చెబుతున్నారు.

బాలీవుడ్ నటి, దర్శకురాలు పూజా భట్.. లైంగిక వేధింపుల అంశంపై జరిగిన ఒక చర్చాకార్యక్రమంలో మాట్లాడింది. ఆమె ఎదుర్కొన్న ఒక అనుభవాన్ని కూడా వివరించింది. తను ఒక స్నేహితుడి నుండి ఎదుర్కొన్న సంఘటనని వివరిస్తూ.. ''ఒక రోజు నాకు వీడ్కోలు చెప్పడానికి నా స్నేహితుడు ఎయిర్ పోర్ట్ కి వచ్చాడు. 

ఇద్దరం బాగానే మాట్లాడుకున్నాం.. ఇక నేను వెళ్లిపోయే సమయానికి ఉన్నట్టుండి అతడు నా బ్రెస్ట్ మీద చేతులేశాడు. గట్టిగా పట్టుకున్నాడు.. అది నేను అసలు ఊహించలేదు.. షాక్ అయిపోయాను'' అంటూ తన స్నేహితుడి నుండే అటువంటి పరిస్థితిని ఎదుర్కొన్నట్లు.. తెలిసిన వాళ్ల రూపంలోనే ఇలాంటి సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయని తన అభిప్రాయాన్ని వెల్లడించింది. 

సంబంధిత వార్త.. 

తాగొచ్చి నన్ను కొట్టేవాడు.. ప్రముఖ లేడీ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు!

Follow Us:
Download App:
  • android
  • ios