హీరోలు నిర్మాతలవుతున్నారు. డైరక్టర్స్ లేమో హీరోలుగా మారుతున్నారు. మొన్న వినాయిక్ ..ఇదిగో ఈ రోజు తరుణ్ భాస్కర్. గత కొద్ది రోజులుగా తరుణ్ భాస్కర్ హీరోగా...విజయ్ దేవరకొండ నిర్మాతగా ఓ చిత్రం రానుందని వార్తలు వస్తున్నాయి. తాజాగా వీటిని ఖరారు చేస్తూ ప్రకటన వచ్చింది.   త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ చిత్రానికి ‘మీకు మాత్రమే చెబుతా’ అనే టైటిల్‌ని నిర్ణయించినట్లు ప్రకటించారు. 

ఇదో వెరైటీ  కథ అని టైటిల్ ని బట్టే అర్థం చేసుకోవచ్చు.  కింగ్ ఆఫ్ ది హిల్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై తరుణ్ భాస్కర్, అనసూయ లతో సినిమా మొదలు కానుంది. ప్రారంభానికి ముందు జరిగిన మాటల వీడియోను షేర్ చేసి ఆ సినిమాకు ఇంట్రస్టింగ్ గా  టైటిల్‌ను ప్రకటించారు.  సినిమా ప్రారంభానికి ముందే పబ్లిసిటీ తేవాలనే ఐడియా విజయ్ దేవరకొండదే అంటున్నారు. గతంలోనూ టాక్సీవాలా చిత్రం ప్రమోషన్స్ కోసం డిఫరెంట్ గా పబ్లిసిటీ చేసిన విజయ్ దేవరకొండ ఈ సినిమా కోసం కూడా కొత్త ఐడియాలతో ప్రమోషన్ ప్లాన్ చేస్తున్నారట. 

ఈ వీడియోలో తరుణ్ భాస్కర్ గల్లీ క్రికెట్ ఆడుతుంటే.. విజయ్ దేవరకొండ ఫోన్ చేసి.. ఇప్పుడే కథ విన్నాను. ఆ సినిమాకు నేనే నిర్మాతగా ఉండాలనుకొంటున్నాను అంటే.. అందుకు తరుణ్ భాస్కర్ సమాధానం ఇస్తూ.. మంచి సినిమాలు తీయి.. ఇంతకు హీరో ఎవరు అంటే.. నీవే అంటూ ఝలక్ ఇవ్వటం గమనించవచ్చు.