హీరో విజయ్ అరెస్ట్

హీరో విజయ్ అరెస్ట్

కన్నడ హీరో దునియా విజయ్ ని పోలీసులు అరెస్టు చేశారు. డైరెక్టర్ ని కాపాడబోయి విజయ్.. ఈ కేసులో ఇరుక్కోగా.. శుక్రవారం సాయత్రం ఆయనను పోలీసులు తమిళనాడులో అరెస్టు చేశారు.

 పూర్తి వివరాల్లోకి వెళితే..  2016 నవంబర్‌ 7న తిప్పగొండనహళ్లి చెరువులో మాస్తిగుడి సినిమా షూటీంగ్‌ చేస్తుండగా వర్తమాన నటులు ఉదయ్, అనిల్‌ నీటిలో మునిగి మృతి చెందారు. వీరి మృతికి దర్శకుడు సుందర పి గౌడ కారణమంటూ నలుగురిపై తావరకెరె పోలీసులు కేసు నమోదు చేశారు. 

వీరిపై రామనగర కోర్టు అరెస్టు చేయాలని అదేశాలు జారీ చేసింది. అదే కేసుకు సంబంధించి సుందరగౌడను అరెస్టు చేయటానికి వెళ్లిన నటుడు దునియా విజయ్‌ అడ్డుకున్నారు.అరెస్టు చేయటానికి వెళ్లిన పోలీసుల విధులకు అటంకం కలిగించరంటూ తావరెకెరె పోలీసు స్టేషన్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ గోవిందరాజు సికే అచ్చుకట్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

తక్షణమే పోలీసులు దునియా విజయ్‌పై కేసు నమోదు చేసిన్నప్పుటి నుండి తప్పించుకు తిరుగుతున్నారు. ఐదు రోజుల పాటు బెంగళురు చుట్టు పక్కల తిరిగిన దునియా పోలీసులను ముప్పుతిప్పలు పెట్టారు. మొబైల్‌ ఫోన్‌ సిగ్నల్స్‌ అధారంగా తమిళనాడులో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు అతనిని అదుపులోకి తీసుకొని విచారించారు.
ఆయనను న్యాయస్థానంలో హాజరుపరచగా.. రూ.లక్ష పూచీ కత్తుతో జామీన్  మంజూరు చేశారు. 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM ENTERTAINMENT

Next page