సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా చేస్తున్నట్లు ప్రకటించినప్పుడు అంతా హడావిడి తప్ప ఏం ఉండదని అనుకున్నారు. దానికి తగ్గట్లే వర్మ కూడా కొంతకాలం పాటు సినిమాను పక్కన పెట్టేశాడు.

ఎప్పుడైతే ఎన్టీఆర్ బయోపిక్ తో క్రిష్ సినిమా చేయడం మొదలుపెట్టాడో.. వర్మ కూడా రంగంలోకి దిగి తన సినిమాను పూర్తి చేశాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్, పోస్టర్స్ తో ఆసక్తిని పెంచాడు. రీసెంట్ గా సినిమా ట్రైలర్ విడుదల చేసి సంచలనం రేపాడు.

ట్రైలర్ చూసిన వారంతా సినిమా ఎప్పుడు థియేటర్ లోకి వస్తుందా..? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పటివరకు సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయలేదు. ట్రైలర్ రిలీజ్ చేసిన తరువాత వర్మ సైలెంట్ అయిపోయాడు. ఎన్టీఆర్ 'మహానాయకుడు' సినిమా రిలీజ్ డేట్ కన్ఫర్మ్ అయిన తరువాత  'లక్ష్మీస్ ఎన్టీఆర్' రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తానని చెప్పిన వర్మ ఇప్పటివరకు చేయలేదు.

దీంతో సినిమా అసలు వస్తుందా లేదా అనే సందేహాలు కొందరిలో కలిగాయి. అయితే ఇప్పుడు వర్మ క్యాంప్ నుండి వినిపిస్తున్న వార్తల ప్రకారం సినిమాను మార్చి 15న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. అయితే ఏపీలో ఈ సినిమావిడుదలవుతుందా లేదా అనేది తెలియాల్సివుంది!