ఈ మధ్యకాలంలో అందరి దృష్టిని ఆకర్షించింది 'కెజిఎఫ్' సినిమా ట్రైలర్. రాజమౌళి సైతం ఈ సినిమాను ప్రమోట్ చేశాడు. ఏకంగా ఐదు భాషల్లో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. యష్ హీరోగా నటించిన ఈ సినిమాకి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు.

ఈ సినిమా రిలీజ్ ని భారీగా ప్లాన్ చేసింది చిత్రబృందం. భారత్ తో పాటు పలు దేశాల్లో 2వేల థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేస్తూ కొత్త రికార్డ్ ని నెలకొల్పే ప్రయత్నాలు చేస్తున్నారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా తెలుగు వెర్షన్ ని 350 థియేటర్ లలో, తమిళ వెర్షన్ ని 150 థియేటర్ లలో, మలయాళం వెర్షన్ 75 థియేటర్ లలో, హిందీ వెర్షన్ 1000 థియేటర్ లలో విడుదల కానుంది. విడుదలకు ముందే ఈ సినిమా హాట్ టాపిక్ గా మారింది. 

ఆన్ లైన్ లో టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. మల్టీప్లెక్స్ లతో పాటు సాధారణ థియేటర్స్ లో సైతం అడ్వాన్స్ బుకింగ్ జోరుగా సాగుతోంది. విడుదలకు ముందే ఈ సినిమా డిమాండ్ ఈ రేంజ్ లో ఉందంటే సినిమా కచ్చితంగా సక్సెస్ అందుకుంటుందనే నమ్మకంతో మేకర్స్ ఉన్నారు.