కొంతకాలం వరకు సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది 'జిమ్మికి కమల్' పాట. మలయాళ నటుడు మోహన్ లాల్ నటించిన 'వెలిపడింతే పుస్తకమ్' సినిమాలో ఈ పాటకు విపరీతమైన ప్రేక్షకాదరణ దక్కింది.

మలయాళీలతో పాటు ఇతర భాషల సెలబ్రిటీలు కూడా ఈ పాటకి డాన్స్ చేశారు. తాజాగా ఈ పాటను తమిళ సినిమా కోసం రీమిక్స్ చేశారు. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన 'తుమ్హారీ సులు' అనే సినిమాని తమిళంలో రీమేక్ చేస్తున్నారు.

జ్యోతిక, మంచు లక్ష్మీ ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. 'కాట్రిన్ మొలి' పేరుతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో 'జిమ్మికి కమ్మల్' పాటకి జ్యోతిక, మంచు లక్ష్మీ స్టెప్పులు వేశారు. 

దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ  సినిమా నవంబర్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది.