యంగ్ టైగర్ ఎన్టీఆర్ నేడు (మే 20) తన 36వ పుట్టినరోజు వేడుకలు జరుపుకొంటున్నారు. 1983లో జన్మించిన తారక్.. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు మనవడిగా తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ నటుడు తిరుగులేని స్టార్ డమ్ సంపాదించుకున్నారు. 

బాలనటుడిగా సినిమాలు చేసిన ఎన్టీఆర్ 'నిన్ను చూడాలనుంది' చిత్రంతో హీరోగా పరిచయమయ్యాడు. 'స్టూడెంట్ నెం 1' చిత్రంతో సక్సెస్ అందుకొని 'ఆది', 'సింహాద్రి', 'యమదొంగ', 'బృందావనం', 'టెంపర్', 'నాన్నకు ప్రేమతో ', 'జనతా గ్యారేజ్', 'జై లవకుశ', 'అరవింద సమేత' వంటి చిత్రాలతో టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోగా దూసుకుపోతున్నాడు.

ప్రస్తుతం ఈ హీరో రాజమౌళి దర్శకత్వంలో 'RRR' చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో 'కొమరం భీం' పాత్రలో తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించనున్నాడు. ఈరోజు ఆయన పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటుండడంతో అభిమానులు, సినీ ప్రముఖులు తారక్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ సోషల్ మీడియాలో పోస్ట్ లు, ట్వీట్ లు పెడుతున్నారు.

దీంతో సోషల్ మీడియాలో 'హ్యాపీబర్త్‌డేఎన్టీఆర్' అనే ట్యాగ్ ట్రెండింగ్ లో అగ్ర స్థానాన్ని సొంతం చేసుకుంది.