సల్మాన్ సూపర్ హిట్ చిత్రం ‘ఏక్ థా టైగర్’అప్పట్లో రికార్డ్ లు క్రియేట్ చేసింది.  సల్మాన్ ఖాన్ ఈ చిత్రంలో ఇండియా సీక్రెట్ ఏజెంట్ టైగర్ పాత్రలో కనిపించగా, కత్రినా కైఫ్ పాకిస్థాన్ ఐ.ఎస్.ఐ ఏజెంట్ పాత్రలో కనిపించారు. యష్ రాజ్ ఫిల్మ్స్ వారు నిర్మించిన ఈ చిత్రానికి కభీర్ ఖాన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం కథనే కొద్దిపాటి మార్పులతో గోపిచంద్ తో చేస్తున్నట్లు సమాచారం. 

వరుసగా ప్లాఫ్ లతో సతమటువుతున్న గోపిచంద్ రెగ్యులర్ సినిమాలు కాకుండా వెరైటీ సినిమాలు చేయాలని ఫిక్స్ అయ్యాడు. మారుతున్న తెలుగు సినిమాని పట్టుకోపోతే తను పూర్తి స్దాయిలోవెనకపడతానని గూఢచారి తరహా ఈ  స్పై థ్రిల్లర్ కు సై అన్నట్లు సమాచారం. 

తమిళ దర్శకుడు తిరు సుబ్రహ్మణ్యం ఈ కథను వినిపించగా బాగా నచ్చేసి షూటింగ్ మొదలెట్టేసారు. ఇప్పటివరకు తానూ చేయని కొత్త జోనర్ కావడం, పాత్ర చాలా కొత్తగా అనిపించడంతో ఒప్పుకున్నాడట. యాక్షన్ ఎంటర్టైనర్ గా అనిపించినప్పటికీ కొత్త కోణంలో కథ ముందుకు వెళుతుందని అంటున్నారు.

జనవరి 18 నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభమైంది. 2019, మే నెలలో సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నారు.  విశాల్ చంద్ర‌శేఖ‌ర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండ‌గా.. వెట్రి ఫ‌ల‌నిస్వామి సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. ఏకే ఎంట‌ర్టైన్మెంట్స్ ప‌తాకంపై అనిల్ సుంక‌ర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

అలాగే ఈ సినిమాలో గోపీచంద్ స‌ర‌స‌న రాశిఖ‌న్నా హీరోయిన్ గా న‌టిస్తున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. స్పై థ్రిల్ల‌ర్ గా రూపొందే ఈ సినిమాలో గోపిచంద్ కొత్త లుక్ లో క‌నిపించ‌నున్నాడ‌ట‌.