అమెరికన్ క్లాసిక్ ‘ఫారెస్ట్ గంప్’కు రీమేక్‌గా ఈ చిత్రం రూపొందింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 11న విడుదల కానుంది. ఈ చిత్రానికి సంబంధించిన ఓటీటీ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ భారీ ధర చెల్లించి సొంతం చేసుకుంది. 


పెద్ద సినిమాల ఓటిటి విషయాలు ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ముఖ్యంగా కోవిడ్ తర్వాత జనం థియేటర్స్ వైపు చూడటానికి ఆసక్తి చూపకపోవటానికి కారణం ఓటిటినే అని అందరూ నిర్ణయానికి వచ్చారు. ఇప్పటికే తెలుగు నిర్మాతలు ఈ విషయమై నిర్ణయాలు తీసుకుని ఓటిటి రిలీజ్ టైమ్ లపై రూల్స్ పెట్టారు. ఇప్పుడు అమీర్ ఖాన్ సైతం తన సినిమా ఓటిటి పై ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలియచేసారు. సినిమాలు విడుదలైన కొన్ని రోజుల్లోనే ఓటీటీ ప్లాట్‌ఫాంలోకి వస్తుండటంతో థియేటర్స్‌కు రావడానికి ప్రేక్షకుల్లో ఆసక్తి తగ్గిపోయిందని ఆమిర్ పేర్కొన్నాడు. 

చివరగా ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ (Thugs of Hindostan) లో కనిపించారు అమీర్ ఖాన్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. దీంతో కొంచెం గ్యాప్ తీసుకుని ‘లాల్ సింగ్ చడ్డా’ (Laal Singh Chaddha)లో నటించాడు. అమెరికన్ క్లాసిక్ ‘ఫారెస్ట్ గంప్’కు రీమేక్‌గా ఈ చిత్రం రూపొందింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 11న విడుదల కానుంది. ఈ చిత్రానికి సంబంధించిన ఓటీటీ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ భారీ ధర చెల్లించి సొంతం చేసుకుంది. కానీ, థియేటర్స్‌లో విడుదలైన ఆరునెలల అనంతరమే ఈ మూవీ ఓటీటీ ప్లాట్‌ఫాంలో స్ట్రీమింగ్ కానుంది. సినిమా థియేట్రికల్ రిలీజ్‌, ఓటీటీ స్ట్రీమింగ్‌కు మధ్య ఆరు నెలల విరామం ఉండటంపై ఆమిర్ ఖాన్ స్పందించాడు. 

‘‘సినిమాలు ఓటీటీలోకి చాలా త్వరగా వస్తున్నాయి. అందువల్ల నా సినిమాల థియేట్రీకల్ రిలీజ్, ఓటీటీ స్ట్రీమింగ్‌కు మధ్య ఆరు నెలల విరామం ఇవ్వాలనుకుంటున్నాను. ఇండస్ట్రీ ఏ నియమాన్ని ఫాలో అవుతుందో నాకు తెలియదు. కానీ, నేను మాత్రం ఆరు నెలల విరామం తర్వాతే ఓటీటీలో స్ట్రీమింగ్ కావాలనుకుంటున్నాను ’’ అని ఆమిర్ ఖాన్ చెప్పాడు. 

‘లాల్ సింగ్ చడ్డా’ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ రూ. 160కోట్లు చెల్లించి సొంతం చేసుకుంది. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ సినిమా ఆ ప్లాట్‌ఫాంలో స్ట్రీమింగ్ కానుంది. ‘లాల్ సింగ్ చడ్డా’ లో కరీనా కపూర్, అక్కినేని నాగచైతన్య కీలక పాత్రలు పోషించారు. అద్వైత్ చందన్ తెరకెక్కించాడు.