Asianet News TeluguAsianet News Telugu

దసరా కానుకగా '2స్టేట్స్' ఫస్ట్ లుక్!

అడివి శేష్, శివానీ రాజశేఖర్ జంటగా ఓ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో సక్సెస్ అయిన '2స్టేట్స్' సినిమాకు రీమేక్ గా ఈ సినిమాను చిత్రీకరిస్తున్నారు. వెంకట్ రెడ్డి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు

'2 States' First Look for Vijayadasami
Author
Hyderabad, First Published Oct 15, 2018, 10:51 AM IST

అడివి శేష్, శివానీ రాజశేఖర్ జంటగా ఓ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో సక్సెస్ అయిన '2స్టేట్స్' సినిమాకు రీమేక్ గా ఈ సినిమాను చిత్రీకరిస్తున్నారు. వెంకట్ రెడ్డి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు.

రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని దసరా కానుకగా విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఇప్పటివరకు సినిమా నాలుగు షెడ్యూల్స్ ని పూర్తి చేసుకుంది.

ఈ నెల 22 నుండి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీ ఖర్చుతో ఓ పెళ్లి పాటను చిత్రీకరించనున్నారు. ఇక్కడ షూటింగ్ పూర్తయిన తరువాత కొన్ని కీలక సన్నివేశాలను విదేశాల్లో చిత్రీకరించనున్నారు. అక్కడితో సినిమా టాకీ పార్ట్ పూర్తవుతుందని దర్శకుడు వెల్లడించాడు. ఈ సినిమాలో ఒకప్పటి బాలీవుడ్ హీరోయిన్ భాగ్యశ్రీ కనిపించనుంది!

Follow Us:
Download App:
  • android
  • ios