హీరోయిన్ రిచా గంగోపాధ్యాయ తెలుగు ప్రేక్షకులకు సుపరిచయమే. రిచా 2010లో రానా దగ్గుబాటి నటించిన లీడర్ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. రిచా  ఇండియాలోనే పుట్టినప్పటికీ ఆ తర్వాత ఆమె కుటుంబ సభ్యులు అమెరికాలో సెటిల్ అయ్యారు. రిచా విధ్యాబ్యాసం మొత్తం అమెరికాలోనే జరిగింది. 

ఉన్నత చదువుల తర్వాత మోడలింగ్ పై ఆసక్తి కనబరిచింది. మోడలింగ్ లో రాణిస్తున్న సమయంలో శేఖర్ కమ్ముల రిచాకు హీరోయిన్ గా లీడర్ చిత్రంలో అవకాశం ఇచ్చారు. రిచా తన కెరీర్ లో లీడర్, మిరపకాయ్, మిర్చి లాంటి సక్సెస్ ఫుల్ చిత్రాల్లో నటించింది. 

క్రమంగా రిచాకు అవకాశాలు తగ్గడంతో వివాహం చేసుకుని స్థిరపడాలని నిర్ణయించుకుంది. ఈ ఏడాది ఆరంభంలో రిచా నిశ్చితార్థం జో లాంగేలా అనే అమెరికన్ యువకుడితో జరిగింది. ఇటీవలే ఈ జంటకు వివాహం కూడా జరిగింది. జో, రిచా పెళ్లి ఫోటోలు సామజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. 

రిచా గంగోపాధ్యాయ సీక్రెట్ గా ప్రేమ వివాహం చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. అందులో ఎలాంటి వాస్తవం లేదని తాజాగా రిచా క్లారిటీ ఇచ్చింది. మూడు నెలల క్రితమే తన పెళ్లి జరిగిపోయిందట. తాను వివాహం చేసుకుంది తన ఎంబీఏ క్లాస్ మేట్ నే అని రిచా తెలిపింది. 

ప్రభాస్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోలు వైరల్!

'నా పెళ్లి సీక్రెట్ గా జరిగినట్లు వార్తలు వచ్చాయి. అలాంటి వార్తలు ఎవరు సృష్టించారో అర్థం కావడం లేదు. అతడు ఎంబీఏ లో నా క్లాస్ మేట్. ఆ సమయంలో మేము ఒక్క మాట కూడా మాట్లాడుకోలేదు. కొన్ని సార్లు మన జీవిత భాగస్వామి పక్కనే ఉన్నా గుర్తించలేం అంటే ఇదేనేమో. నేను పెరిగిన మిచిగాన్ లో ఇండో అమెరికా సంప్రదాయాల ప్రకారం మా వివాహం చాలా అందంగా జరిగింది . ఇరు కుటుంబ సభ్యులు, బంధు మిత్రుల సమక్షంలో నా వివాహం జరిగింది. 

ఓ మంచి ఇంటికి కోడలినయ్యా. సినిమాలకు దూరమై ఆరేళ్ళు గడచినా నాపై అభిమానం ఇంకా తగ్గలేదు. అందుకు చాలా సంతోషంగా ఫీల్ అవ్వుతున్నా' అంటూ రిచా తన పెళ్లి సంగతులని చెప్పుకొచ్చింది.