పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇద్దరూ టాలీవుడ్ లో అగ్ర హీరోలు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. త్వరలో సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నారు. ఇక ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రంతో బిజీగా గడుపుతున్నారు. ఆర్ఆర్ఆర్ మూవీలో ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. 

ఈ ఇద్దరు హీరోలకు తెలుగులో విశేషమైన సంఖ్యలో అభిమానులు ఉన్నారు. ఒక హీరో సినిమా వేడుకకు మరొక స్టార్ హీరో హాజరైనా లేదా ఇద్దరు స్టార్ హీరోలు ఒకే వేదికపై కనిపించినా అభిమానులకు కనుల పండుగలా ఉంటుంది. పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ చాలా తక్కువగా కలుసుకున్నారు. 

తాజాగా ఓ వీడియో వైరల్ అవుతోంది. పవన్ కళ్యాణ్ సినిమా సాంగ్ కు ఎన్టీఆర్ డాన్స్ చేస్తున్న వీడియో అది. పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ చిత్రం గబ్బర్ సింగ్ మూవీలోని 'కెవ్వు కేక' సాంగ్ కు ఎన్టీఆర్ హుషారుగా స్టెప్పులు వేస్తున్నాడు. ఆ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తోంది. 

అందంతో సమ్మోహనపరుస్తున్న శ్రీముఖి.. వైరల్ అవుతున్న ఫోటోషూట్

ఎన్టీఆర్ మాత్రమే కాదు.. ప్రభాస్ కూడా ఈ వీడియోలో కనిపిస్తున్నాడు. ఈ ఏడాది ఆరంభంలో రాజమౌళి తనయుడు కార్తికేయ వివాహం జరిగింది. ఈ వివాహ వేడుకకు ఎన్టీఆర్, ప్రభాస్, రాంచరణ్, రానా, అఖిల్, అనుష్క లాంటి సెలెబ్రిటీలందరూ హాజరయ్యారు. 

కేసీఆర్ ముందే జోకులేసిన విజయ్ దేవరకొండ!

జైపూర్ లో జరిగిన ఈ వివాహ వేడుకలో సెలెబ్రిటీలంతా హుషారుగా పాల్గొన్నారు. అక్కడ కెవ్వు కేక సాంగ్ ప్లే కావడంతో ఎన్టీఆర్, ప్రభాస్ హుషారుగా డాన్స్ చేశారు. గతంలో ఎన్టీఆర్ అరవింద సమేత చిత్ర ఓపెనింగ్ కు పవన్ కళ్యాణ్ అతిథిగా హాజరయ్యారు.