టాలీవుడ్ లో విజయ్ దేవరకొండ రౌడీ హీరో. యువతని ఆకర్శించే చిత్రాలు చేస్తూ విపరీతమైన ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు.  పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం చిత్రాలు విజయ్ దేవరకొండ క్రేజ్ ని అమాంతం పెంచేశాయి. విజయ్ దేవరకొండ ఈ కార్యక్రమానికి వెళ్లినా అక్కడ పెద్ద ఎత్తున సందడి కనిపిస్తుంది. 

ఇటీవల ఓ ప్రముఖ ఛానల్ నిర్వహించిన అవార్డుల వేడుకలో విజయ్ దేవరకొండ మెరిసాడు. ఈ కార్యక్రమానికి సినీ రాజకీయ ప్రముఖులు పెద్దఎత్తున హాజరయ్యారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మెగాస్టార్ చిరంజీవి, నిర్మాత సురేష్ బాబు లాంటి ప్రముఖులంతా ఈ కార్యక్రమంలో కనిపించడం విశేషం. 

ఎంటర్టైన్మెంట్ విభాగంలో పీపుల్స్ ఛాయిస్ పాపులర్ అవార్డుని విజయ్ దేవరకొండ అందుకున్నాడు. ముఖ్యమంత్రి కేసీఆర్ విజయ్ దేవరకొండకు అవార్డు అందించి అతడిని సన్మానించారు. అనంతరం విజయ్ దేవరకొండ మాట్లాడుతూ కేసీఆర్ సమక్షంలోనే ఫన్నీ జోకులు వేశాడు. 

గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి నమస్కారం అని విజయ్ దేవరకొండ తన ప్రసంగం ప్రారంభించాడు. ఇక్కడ నా అభిమాన నాయకులు, నిర్మాతలు, సూపర్ స్టార్స్ ఉన్నారు. వారందరి ఏవీలు చూస్తుంటే ఇక్కడి నుంచి పారిపోదామనుకున్నా. కానీ ముఖ్యమంత్రి గారి సెక్యూరిటీ చాలా టైట్ గా ఉంది అని విజయ్ జోకులువేసాడు.

రామ్ చరణ్ తో ప్రయోగం చేయనున్న మాస్ డైరెక్టర్ ?

మూడున్నర ఎల్లా క్రితం తాను పెళ్లి చూపులు చిత్రంతో హీరోగా పరిచయమైనప్పుడు ఇండస్ట్రీలో ఎక్స్టార్డినరీ గా ఉండాలని అనుకున్నా. అందుకోసం ఆర్డినరీ వ్యక్తులకంటే మనం ఎక్కువ కష్టపడాలని డిసైడ్ అయ్యా. ఇప్పుడు నేనున్నా పొజిషన్ చూస్తుంటే నాక్కుడా ఆశ్చర్యంగా ఉంది అని విజయ్ దేవరకొండ తెలిపాడు. 

ఎక్స్‌పోజింగ్‌ కోసమే రష్మిని వాడుకుంటున్నారు.. డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్!