ఎనెర్జిటిక్ స్టార్ రామ్ నటిస్తున్న తాజా చిత్రం రెడ్. తమిళంలో ఘనవిజయం సాధించిన తడం చిత్రానికి రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. థ్రిల్లర్ కథాంశంతో రాబోతున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో రామ్ తన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ సొంతం చేసుకున్నాడు. 

ఇస్మార్ట్ శంకర్ తర్వాత రామ్ నుంచి రాబోతున్న చిత్రం కావడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఇటీవల విడుదలైన ఈ చిత్ర టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. కిషోర్ తిరుమల ఈ చిత్రానికి దర్శకుడు. ఈ చిత్రంలో ముగ్గురు క్రేజీ హీరోయిన్లు నటిస్తున్నారు. నివేత పేతురాజ్ ఈ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ గా నటిస్తోంది. 

భార్యని వదిలేస్తా అని చెప్పి హీరోయిన్ తో క్రికెటర్ సంబంధం.. బయటపడ్డ నిజాలు!

అమృత అయ్యర్, మాళవిక శర్మ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో హాట్ బ్యూటీ హెబ్బా పటేల్ కూడా భాగం కాబోతోంది. రామ్ కి జోడిగా హెబ్బా ఈ చిత్రంలో ఓ ఐటెం సాంగ్ లో చిందేయబోతున్నట్లు సమాచారం. కుమారి 21 ఎఫ్ చిత్రంతో హెబ్బా పటేల్ కుర్రకారు హృదయాల్ని మాయ చేసింది. 

మూడో ప్రపంచ యుద్ధమా.. ప్రభాస్ తో ఆడుకుంటున్నారుగా.. దీనికి ఎన్ని కోట్లో?

హెబ్బా చివరగా నితిన్ భీష్మ చిత్రంలో చిన్న పాత్రలో మెరిసింది. ప్రస్తుతం హెబ్బా పటేల్ కు అవకాశాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి, అందుకే ఈ యంగ్ బ్యూటీ స్పెషల్ సాంగ్స్ కి సైతం ఓకే చెబుతోంది.