యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం టాలీవుడ్ కు మాత్రమే పరిమితమైన హీరో కాదు. బాలీవుడ్ స్టార్స్ ని తలదన్నేలా ఇండియా వ్యాప్తంగా ప్రభాస్ కు అద్భుతమైన క్రేజ్ ఉంది. బాహుబలి చిత్రంతో ప్రభాస్ ని అభిమానులు భాషలు, ప్రాంతాల భేదాలు లేకుండా అంతా అభిమానిస్తున్నారు. గత ఏడాది ప్రభాస్ నటించిన సాహో చిత్రం తీవ్రంగా నిరాశపరిచింది. 

దీనితో తన తదుపరి చిత్రాలతో అభిమానులకు మంచి అనుభూతి అందించాలని ప్రభాస్ ప్రయత్నిస్తున్నాడు. ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ దర్శత్వంలో ఓ డియర్(వర్కింగ్ టైటిల్) అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం తర్వాత ప్రభాస్ 21వ చిత్రం కూడా ఖరారైంది. మహానటి చిత్రంతో దర్శకుడిగా అద్భుతమైన గుర్తింపు సొంతం చేసుకున్న నాగ్ అశ్విన్ దర్శత్వంలో ప్రభాస్ నటించబోతున్నాడు. 

వైజయంతి మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ లో నిర్మిస్తోంది. బాహుబలి చిత్రం నుంచి ప్రభాస్ ఒళ్ళు హూనం అయిపోతోంది. బాహుబలి భారీ బడ్జెట్ చిత్రం కావడంతో ప్రభాస్ దాదాపు 4 ఏళ్ల పాటు కష్టపడ్డాడు. బాహుబలి రెండు భాగాలకు దాదాపు 200 కోట్ల వరకు ఖర్చయింది. 

ఆ తర్వాత వచ్చిన సాహో చిత్ర షూటింగ్ రెండేళ్ల పాటు సాగింది. ఆ చిత్రానికి 350 కోట్ల బడ్జెట్ వెచ్చించారు. ఇప్పుడు తెరకెక్కుతున్న ఓ డియర్ చిత్రంకూడా పీరియాడిక్ లవ్ స్టోరీ. తాజాగా నాగ్ అశ్విన్ దర్శత్వంలో తెరకెక్కించే చిత్ర కథకు సంబంధించిన వార్తలు ఆసక్తి రేపుతున్నాయి. 

నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని మూడో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో తెరకెక్కించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రం కూడా భారీ బడ్జెట్ లో తెరకెక్కనుందని అంచనా వేస్తున్నారు. వరల్డ్ వార్ బ్యాక్ డ్రాప్ అంటే విజువల్ ఎఫెక్ట్స్ ఏ రేంజ్ లో ఉంటాయో ఊహించుకోవచ్చు. ఇక ఈ చిత్రంలో ప్రభాస్ ప్రత్యేకమైన శక్తులు కలిగిన సూపర్ హీరోగా కనిపించనున్నాడట. 

భార్యని వదిలేస్తా అని చెప్పి హీరోయిన్ తో క్రికెటర్ సంబంధం.. బయటపడ్డ నిజాలు!

అంటే ప్రభాస్ ఈ చిత్రానికి కూడా ఎక్కువ సమయం కేటాయించాల్సి ఉంటుంది. బాహుబలి మొదలైనప్పటికీ నుంచి దర్శకులు ప్రభాస్ కు చుక్కలు చూపిస్తున్నారు. ఒక వేళ మూడవ ప్రపంచ యుద్ధం వస్తే పరిస్థితులు ఎలా ఉంటాయి అనే పాయింట్ ఆధారంగా నాగ్ అశ్విన్ ఈ కథ రాసుకునట్లు తెలుస్తోంది. అణ్వస్త్రాలు, బయో వార్, విధ్వంసం సృష్టించే ఎయిర్ ఫోర్స్ ఇలా వరల్డ్ వార్ లో హంగామా మాములుగా ఉండదు. కాబట్టి ఈ చిత్ర బడ్జెట్ మన ఊహకి అందదు అని టాలీవుడ్ టాలీవుడ్ విశ్లేషకులు అంటున్నారు.