తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ తన ప్రభావాన్ని మొదలు పెట్టింది. ముఖ్యంగా తెలంగాణాలో 30కి పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే రెండు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జగన్ పటిష్ట చర్యలు చేపడుతున్నారు. రెండు రాష్ట్రాల్లో లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. 

ప్రస్తుతం ఇండియాలో కరోనా వైరస్ స్టేజి 2 లో ఉంది. ఇంతకు మించి దాటకూడదని కేంద్రప్రభత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, వైద్య సిబ్బంది, పోలీసులు, ఇతర అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. పరిస్థితి అదుపు దాటకూడదని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. అందుకే అన్ని రాష్ట్రాలకు రాక పోకలు లేకుండా స్తంబింపజేస్తున్నారు. 

పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ పై కేజీఎఫ్ డైరెక్టర్ క్రేజీ కామెంట్స్

ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో యంగ్ హీరో నితిన్ గొప్ప చర్యకు పూనుకున్నాడు. సరైన సమయంలో కరోనా సహాయ చర్యలకు గాను విరాళం ప్రకటించాడు. ఈ మేరకు నితిన్ తెలంగాణ సీఎం సహాయనిధికి 10 లక్షలు, ఏపీ సీఎం సహాయ నిధికి 10 లక్షల ఆర్థిక సాయం ప్రకటించాడు. దీనితో నితిన్ పై ప్రశంసలు కురుస్తున్నాయి. 

న్యూడ్ వీడియో, ఫోటోలు పోస్ట్ చేసిన నటి.. ఈ ఆంటీకి కరోనా బాగా నచ్చేసినట్లుంది!

ఇటీవలే నితిన్ నటించిన భీష్మ చిత్రం ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. అలాగే త్వరలో నితిన్ వివాహం కూడా జరగనుంది. కరోనా లేకుంటే ముందుగా అనుకున్న ముహూర్తం ప్రకారం ఏప్రిల్ 16న నితిన్ వివాహం జరగాల్సి ఉంది. కానీ కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో నితిన్ వివాహం వాయిదా పడిందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.