ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ సృష్టిస్తున్న కల్లోలం అంతా ఇంతా కాదు. చైనాలో పుట్టుకొచ్చిన ఈ మహమ్మారి అక్కడ విధ్వంసం సృష్టించి ఇప్పుడు ప్రపంచ దేశాలపై పంజా విసురుతోంది. అమెరికా, ఇటలీ, ఇరాన్, ఫ్రాన్స్ తో పాటు ఇండియాలో కూడా కరోనా ప్రభావం కనిపిస్తోంది. దీనితో సెలెబ్రిటీలు, నాయకులు, అన్ని రంగాల ప్రముఖులు ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేస్తూ కరోనా బారీన పడకుండా జాగ్రత్తలు చెబుతున్నారు. 

కానీ 61 ఏళ్ల హాట్ బ్యూటీ మడోన్నా మాత్రం భిన్నంగా స్పందించింది. ప్రపంచంలోని సంగీత ప్రియులకు మడోన్నా గురించి తెలిసే ఉంటుంది. క్వీన్ ఆఫ్ పాప్ గా మడోన్నా గుర్తింపు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. దశాబ్దాల కాలంగా తన గాత్రంతో ప్రేక్షకులని ఉర్రూతలూగిస్తోంది. 

కరోనా వైరస్ పై మడోన్నా స్పదించిన తీరు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. బాత్ టబ్ లో న్యూడ్ గా స్నానం చేస్తూ కరొనాపై కామెంట్స్ చేసింది. కరోనా ఎంత భయంకరమైనదో పక్కన పెడితే.. దాని వల్ల కొన్ని అద్భుతాలు కూడా జరిగాయి. కరోనా వైరస్ కారణంగా చాలా రకాలుగా ప్రపంచ ప్రజలు ఏకం అయ్యారు. అందరికి ఒక్కటి చేసిన ఘనత కరోనా వైరస్ దే అని మడోన్నా తన బాత్ టబ్ లో స్నానం చేస్తూ తెలిపింది. 

ఆ వీడియో, న్యూడ్ ఫోటోలని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయగా వైరల్ అయ్యాయి. మడోన్నా లాంటి సెలెబ్రిటీలు కరోనాపై అవేర్నెస్ పెంచాల్సింది పోయి ఇలా కామెంట్స్ చేయడం ఏంటి అని కొందరు నెటిజన్లు అంటున్నారు. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

No-Discrimination- Covid-19!! #quarantine #covid_19 #staysafe #becreative #brianeno

A post shared by Madonna (@madonna) on Mar 22, 2020 at 8:27am PDT