దేశం మొత్తం ఎదురుచూస్తున్న చిత్రాలలో కెజిఎఫ్ 2 ఒకటి. 2018లో విడుదలైన కెజిఎఫ్ చిత్రం దేశవ్యాప్తంగా సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. దీనితో కెజిఎఫ్ చాప్టర్ 2 కోసం ప్రతి ఒక్కరూ ఎదురుచూస్తున్నారు. కెజిఎఫ్ 2ని అక్టోబర్ 23న దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించారు. 

ఈ చిత్రం ద్వారా హీరో యష్ కి, దర్శకుడు ప్రశాంత్ నీల్ కి దేశవ్యాప్తంగా గుర్తింపు లభించింది. ప్రశాంత్ నీల్ తదుపరి చిత్రం తెలుగు హీరోతో ఉంటుందనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా ప్రశాంత్ నీల్ ఇటీవల సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటిస్తూ తెలుగు హీరోలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  

బాలీవుడ్ లో నితిన్ 'భీష్మ' రీమేక్.. రొమాంటిక్ హీరోతో బడా నిర్మాత ప్లాన్?

ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటన మరొకరు భర్తీ చేయలేనిది అని ప్రశంసించారు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ మరొకరికి సాధ్యం కాదని అన్నారు. ఇక రాజమౌళి మిగిలినవారందరికి సరికొత్త దారి చూపించే దర్శకుడు అని.. తాను ఆర్ఆర్ఆర్ చిత్రం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు ప్రశాంత్ నీల్ తెలిపాడు. ఇక తెలుగులో మెగాస్టార్ 152వ చిత్రం, అల్లు అర్జున్ 20 వ చిత్రం కోసం కూడా తాను ఆసక్తిగా ఉన్నట్లు ప్రశాంత్ నీల్ చెప్పుకొచ్చాడు. 

గత కొన్ని రోజులుగా ప్రశాంత్ నీల్ తదుపరి చిత్రం ఎన్టీఆర్ తో కానీ, మహేష్ బాబుతో కానీ ఉండబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఓ ఇంటర్వ్యూలో మహేష్ మాట్లాడుతూ తనకు, ప్రశాంత్ నీల్ కు మధ్య ప్రాథమిక చర్చ మొదలైందని కంఫర్మ్ చేశాడు.