‘బాహుబలి’ చిత్రంతో అంతర్జాతీయంగా క్రేజ్‌ సంపాదించుకున్న టాలీవుడ్ దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి. సాధారణంగా పెద్ద సినిమా రిలీజ్ అయ్యినప్పుడల్లా దానికి తనదైన శైలిలో రివ్యూ టైప్ ఓ ట్వీట్ చేస్తూండటం చూస్తున్నాం. అయితే ఈ సంక్రాంతికి ఆయన సైలెంట్ అయ్యిపోయారు. రీసెంట్ గా తన అన్న కీరవాణి కొడుకులు ఇద్దరూ చేసిన మత్తు వదలరా సినిమా కు ప్రమోట్ చేసి రచ్చ చేసిన రాజమౌళి..ఈ సారి సైలెంట్ గా ఉండటం చాలా మందిని నిరాశపరిచింది.

మహేష్ బాబు, అల్లు అర్జున్ ఇద్దరితో ఇప్పటిదాకా ఆయన సినిమాలు చెయ్యలేదు. కానీ ఇద్దరితోనూ మంచి ర్యాపో ఉంది. నెక్ట్స్ సినిమాతో మహేష్ తో చేసే అవకాసం ఉందని అంటున్నారు. అయినా సరే రాజమౌళి ఈ సంక్రాంతి సినిమాలను పట్టించుకోకపోవటం ఆశ్చర్యమే.

దుమ్మురేపుతున్న‘సిత్తరాల’ పాట... సిరపడు అంటే ఏంటో తెలుసా..?

అయితే పొగిడితే రెండు సినిమాలను పొగడాలి. ఒకరిని మెచ్చుకుని మరొకరిని వదిలేస్తే బాగుండుదు అని సైలెంట్ అయ్యాడని ఓ వర్గం అంటోంది. మరికొంతమంది ఆయన హైదరాబాద్ లో లేరు..అందుకే సంక్రాంతి సినిమాలు మిస్ అయ్యారు. ఈ నేపధ్యంలో ఆయన ట్వీట్ చెయ్యలేదని చెప్తున్నారు. అలాంటిదేమీ లేదని రెండు సినిమాల్లో ఏదీ ఆయనకు నచ్చలేదు కాబట్టే సైలెంట్ అయ్యిపోయారని మరికొంతమంది అంటున్నారు. ఏదీ ఏమైనా రాజమౌళి సైలెన్స్ కూడా చాలా మందిలో హాట్ టాపిక్ గా మారింది.

'సరిలేరు నీకెవ్వరు' ఫస్ట్ వీక్ కలెక్షన్స్.. 'మైండ్ బ్లాక్'!

ప్రస్తుతం రాజమౌళి...ఆర్‌.ఆర్‌.ఆర్‌’ సినిమా డైరక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా గురించి ఆయన మాట్లాడుతూ... ‘‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ సినిమా పాన్‌‌ ఇండియా సినిమా. ఎందుకంటే కథ ఆ కోవలో ఉంటుంది. ‘బాహుబలి’ కంటే గొప్పగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం’ అని అన్నారు.

‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ సినిమాలో రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌  హీరోగా నటిస్తున్నారు. దానయ్య సినిమాను నిర్మిస్తున్నారు. ఎమ్‌.ఎమ్‌. కీరవాణి సినిమాకు సంగీతం అందిస్తున్నారు. దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్‌తో దీన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.