Asianet News TeluguAsianet News Telugu

'సరిలేరు నీకెవ్వరు' ఫస్ట్ వీక్ కలెక్షన్స్.. 'మైండ్ బ్లాక్'!

పండగ సీజన్ ని ఈ సినిమా బాగానే క్యాష్ చేసుకుంది.  నైజాం లో ఈ చిత్రం మొదటివారం ముగిసే నాటికి 27.7 కోట్ల షేర్ రాబట్టింది. ఇక సీడెడ్ లో 12.4 కోట్లు, గుంటూరులో 8.16 కోట్లు, కృష్ణ 6.87 కోట్ల షేర్ వసూలు చేసింది. కొన్ని ఏరియాలలో బ్రేక్ ఈవెన్ కి చేరుకుంది. 

Sarileru Neekevvaru Movie First Week Collections
Author
Hyderabad, First Published Jan 18, 2020, 1:05 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'సరిలేరు నీకెవ్వరు' సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. కలెక్షన్స్ పరంగా కూడా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. పండగ సీజన్ ని ఈ సినిమా బాగానే క్యాష్ చేసుకుంది.  

నైజాం లో ఈ చిత్రం మొదటివారం ముగిసే నాటికి 27.7 కోట్ల షేర్ రాబట్టింది. ఇక సీడెడ్ లో 12.4 కోట్లు, గుంటూరులో 8.16 కోట్లు, కృష్ణ 6.87 కోట్ల షేర్ వసూలు చేసింది. కొన్ని ఏరియాలలో బ్రేక్ ఈవెన్ కి చేరుకుంది. 

మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు' బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్(ఫొటోస్)

ప్రాంతాల వారీగా మొదటివారం ఏపీ/తెలంగాణా కలెక్షన్స్ వివరాలు…
నైజాం............................. రూ.27.7 కోట్లు
సీడెడ్............................. రూ.12.4 కోట్లు
ఉత్తరాంధ్ర................... రూ.13.5 కోట్లు
గుంటూరు...................... రూ.8.16 కోట్లు
ఈస్ట్................................రూ.8.19 కోట్లు
వెస్ట్.................................రూ.5.61 కోట్లు
కృష్ణ................................రూ.6.87 కోట్లు
నెల్లూరు..........................రూ.3.13 కోట్లు

మొత్తం వారం రోజులకు రెండు తెలుగు రాష్ట్రాలలో రూ. 85.56 కోట్ల షేర్ ని రాబట్టింది. 

ఇక కర్ణాటకలో రూ.6.4 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా,తమిళనాడు కలిపి రూ.2.7కోట్లు, అమెరికా+కెనడా కలిపి రూ.8.01 కోట్లు, ఆస్ట్రేలియాలో రూ.కోటి, రెస్ట్ ఆఫ్ వరల్డ్ మరో కోటి వరకు వసూళ్లు వచ్చాయి. మొత్తం వరల్డ్ వైడ్ ఈ సినిమా కలెక్షన్స్ చూసుకుంటే రూ.105.56 కోట్ల వసూళ్లను సాధించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios