సౌత్ స్టార్ హీరోయిన్లు నయనతార, సమంత తొలిసారి కలసి నటించేందుకు సిద్ధం అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తమిళ సినీ వర్గాల నుంచి వస్తున్న విశ్వసనీయ సమాచారం మేరకు వీరిద్దరూ ఓ క్రేజీ చిత్రంలో నటించబోతున్నారట.  సౌత్ లో నయనతార వన్నె తరగని అందంతో లేడీ సూపర్ స్టార్ గా దూసుకుపోతోంది. 

ఇక సమంత టాలీవుడ్ లో నటనకు మారుపేరుగా మారిపోయింది. ఇటీవల కొన్నేళ్లలో సమంత రంగస్థలం, మహానటి, ఓ బేబీ లాంటి అద్భుతమైన చిత్రాల్లో నటించింది. ఈ శుక్రవారం సమంత జాను చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. 

తమిళ నటుడు విజయ్ సేతుపతి విలక్షణ నటనతో అదరగొడుతున్నాడు. కేవలం హీరోగా మాత్రమే కాదు.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా కూడా నటిస్తున్నాడు. ప్రస్తుతం విజయ్ సేతుపతి ఉప్పెన, ఇళయదళపతి విజయ్ నటిస్తున్న మాస్టర్ చిత్రాల్లో విలన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. విజయ్ విలక్షణ నటనకు ఫిదా అవుతున్న దర్శకులు అతడిని విలన్ రోల్స్ కి కూడా ఉపయోగించుకుంటున్నారు. 

అల్లు అర్జున్ రూ.10 లక్షల విరాళం.. వారికోసమే..

ఈ విలక్షణ నటుడితో నయనతార, సమంత రొమాన్స్ చేసేందుకు రెడీ అవుతున్నారు. విగ్నేష్ శివన్ దర్శకత్వంలో త్వరలో ఓ చిత్రం తెరకెక్కబోతోంది. ఈ చిత్రంలో ఇప్పటికే హీరోయిన్ గా నయనతార ఎంపికైంది. తాజాగా సమంత కూడా మరో హీరోయిన్ గా ఎంపికైనట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 

బ్లాక్ డ్రెస్ లో 'ఎఫ్ 2' హీరోయిన్ ఫోజులు.. సమ్మోహన పరిచే అందం!

నయనతార, విజయ్ సేతుపతి, విగ్నేష్ శివన్ కాంబోలో ఇప్పటికే 'నానుమ్ రౌడీ దాన్' అనే చిత్రం తెరకెక్కింది. మరోసారి ఈ కాంబోలో చిత్రం రానుండడంతో ఆసక్తి నెలకొంది.