రౌడీ హీరో విజయ్ దేవరకొండ తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు. అర్జున్ రెడ్డి, గీత గోవిందం లాంటి చిత్రాలు విజయ్ దేవరకొండ క్రేజ్ కు కారణమయ్యాయి. కాగా ఇటీవల విజయ్ దేవరకొండ కు సరైన సక్సెస్ లేదు. గత ఏడాది వచ్చిన డియర్ కామ్రేడ్, ఈ ఏడాది విడుదలైన వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రాలు తీవ్రంగా నిరాశపరిచాయి. 

ప్రస్తుతం విజయ్ దేవరకొండ ఆశలన్నీ పూరి జగన్నాధ్ తెరకెక్కిస్తున్న ఫైటర్ చిత్రంపైనే ఉన్నాయి. ఇస్మార్ట్ శంకర్ లాంటి భారీ హిట్ తర్వాత పూరి దర్శత్వంలో వస్తున్న చిత్రం ఇది. ఈ చిత్రంలో విజయ్ కి జోడిగా బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తోంది. 

ప్రస్తుతం ఫైటర్ చిత్ర షూటింగ్ వేగంగా జరుగుతోంది. షూటింగ్ లొకేషన్ నుంచి లీక్ అవుతున్న ఫోటోలు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. పూరి తనదైన శైలిలో ఈ చిత్రాన్ని రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నాడు. ఇటీవల విజయ్, అనన్య బైక్ పై కూర్చుని ఉన్న పిక్స్ లీకయ్యాయి. తాజాగా విజయ్ దేవరకొండ.. అనన్య పాండే నడుముతో రొమాన్స్ చేస్తున్న పిక్ వైరల్ గా మారింది. 

పవన్ కళ్యాణ్ 'వకీల్ సాబ్' ఫస్ట్ లుక్ పై వర్మ కామెంట్స్!

హీరో, హీరోయిన్ల మధ్య మంచి కెమిస్ట్రీ పండేలా చేయడంలో పూరి దిట్ట. ఇస్మార్ట్ శంకర్ చిత్రంలో హీరో రామ్.. నభా నటేష్, నిధి అగర్వాల్ తో చేసిన రొమాన్స్ యువతని ఆకట్టుకుంది. ఫైటర్ చిత్రంలో కూడా పూరి ఎక్కువగా విజయ్, అనన్య రొమాన్స్ పైనే ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. 

'వకీల్ సాబ్' ఫస్ట్ లుక్ పై సెలెబ్రిటీల రెస్పాన్స్.. దిల్ రాజు ఆఫీస్ ఎదుట సంబరాలు (ఫొటోస్)