జనసేనాని పవన్ కళ్యాణ్ రెండేళ్ల గ్యాప్ తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నారు. హిందీలో ఘనవిజయం సాధించిన పింక్ రీమేక్ తో పవన్ కళ్యాణ్ రాబోతున్న సంగతి తెలిసిందే.

జనసేనాని పవన్ కళ్యాణ్ రెండేళ్ల గ్యాప్ తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నారు. హిందీలో ఘనవిజయం సాధించిన పింక్ రీమేక్ తో పవన్ కళ్యాణ్ రాబోతున్న సంగతి తెలిసిందే. కొద్దిసేపతి క్రితమే విడుదలైన ఫస్ట్ లుక్ తో అభిమానుల సంబరాలు మొదలయ్యాయి. 

ఈ చిత్రానికి వకీల్ సాబ్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. పవర్ స్టార్ స్టైల్, మేనరిజమ్స్ ఏమాత్రం మిస్ కాకుండా దర్శకుడు ఈ లుక్ రెడీ చేశారు. ప్రస్తుతం వకీల్ సాబ్ ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదిలా ఉండగా ఫస్ట్ లుక్ రిలీజ్ కు కొన్ని గంటల ముందు నుంచే బంజారా హిల్స్ లోని దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఆఫీస్ ఎదుట పవన్ అభిమానులు పెద్ద సంఖ్యలో గుమిగూడారు. 

ఫస్ట్ లుక్ రిలీజ్ సందర్భంగా దిల్ రాజు ఆఫీస్ ఎదుట హంగామా చేశారు. ఫస్ట్ లుక్ విడుదల కాగానే దిల్ రాజుని ఫ్యాన్స్ చుట్టుముట్టారు. కేక్ కట్ చేయించి తమ సంతోషాన్ని తెలిసీజేశారు. ప్రస్తుతం ఆ ఫొటోస్ వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వకీల్ సాబ్ ఫస్ట్ లుక్ పై వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, నిఖిల్, అనిల్ రావిపూడి, హరీష్ శంకర్ లాంటి సెలెబ్రిటీలంతా సోషల్ మీడియాలో స్పందించారు. 

అజ్ఞాతవాసి తర్వాత పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రం ఇదే. మే లో రిలీజ్ చేసేందుకు సన్నాహకాలు జరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ లాయర్ పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని దర్శకుడు వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్నారు. నివేత థామస్, అంజలి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 

Scroll to load tweet…
Scroll to load tweet…
Scroll to load tweet…
Scroll to load tweet…
Scroll to load tweet…

Scroll to load tweet…