పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ చిత్రం వకీల్ సాబ్ హంగామా మొదలైపోయింది. పింక్ చిత్రానికి రీమేక్ గా తెరకెక్కుతున్న వకీల్ సాయిబు ఫస్ట్ లుక్ ని చిత్ర యూనిట్ విడుదుల చేసింది. ఫస్ట్ లుక్ రిలీజ్ కు ప్రకటన వచ్చినప్పటి నుంచే సోషల్ మీడియాలో ట్రెండింగ్ మొదలు పెట్టిన పవన్ ఫ్యాన్స్.. లుక్ రిలీజ్ అయ్యాక మరింతగా రెచ్చిపోతున్నారు. 

ప్రస్తుతం వకీల్ సాబ్ ఫస్ట్ లుక్ ట్విట్టర్ లో టాప్ ప్లేస్ లో ట్రెండ్ అవుతోంది. ఇక సెలబ్రిటీలు కూడా పవన్ రీ ఎంట్రీకి స్వాగతం పలుకుతూ ఫస్ట్ లుక్ పై స్పందిస్తున్నారు. అందరికంటే రామ్ గోపాల్ వర్మ స్పందన విభిన్నంగా ఉంటుంది. తాజాగా వర్మ ట్విట్టర్ వేదికగా వకీల్ సాబ్ ఫస్ట్ లుక్ పై తనదైన శైలిలో స్పందించాడు. 

దాదాపు పవన్ కళ్యాణ్ తరహాలోనే ఉన్న వర్మ తన ఫోజుని వకీల్ సాబ్ లుక్ లో పోల్చుతూ ట్వీట్ చేశాడు. పవన్ కళ్యాణ్ సినిమాకు వకీల్ సాబ్ టైటిల్ కాగా.. వర్మ తన ఫోజులు డైరెక్టర్ సాబ్ అని పేరు పెట్టుకున్నాడు. 

ఈ మీమ్ ని ఎవరో తయారు చేసారు అంటూ తనదైన శైలిలో అర్థం అయి అర్థం కానీ విధంగా కామెంట్ పెట్టాడు. మొత్తంగా వర్మ చేసిన ట్వీట్ ప్రకారం.. పవన్ వకీల్ సాబ్ అయితే.. ఆర్జీవీ డైరెక్టర్ సాబ్ అట. 

పవన్ కళ్యాణ్ లాయర్ పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం వేసవి కానుకగా మేలో రిలీజ్ కు రెడీ అవుతోంది. తమన్ సంగీత దర్శకుడు. దిల్ రాజు, బోణి కపూర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అంజలి, నివేత థామస్, ప్రకాష్ రాజ్ ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.